Supreme Court: నోయిడా జంట టవర్లను కూల్చేయండి

Supreme Court Orders Demolition of Twin 40 Storey Towers in Noida
x

యూపీ లోని ట్విన్ టవర్స్ కులివేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశం (ఫైల్ ఇమేజ్)

Highlights

Supreme Court: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందుకు కోర్ట్ ఆదేశం

Supreme Court: యూపీలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ జంట టవర్లనుకూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్‌టెక్‌ ఎమరాల్డ్‌ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించింది. అయితే ఇవి నిబంధనలకు విరుద్ధమంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని.. దానికయ్యే ఖర్చునూ సూపర్‌టెక్‌ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపు వెయ్యి ప్లాట్లు ఉండగా.. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories