Supreme Court: కళాశాలల్లో స్టూడెంట్స్ హిజాబ్‌ ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court key comments on students wearing hijab in colleges
x

Supreme Court: కళాశాలల్లో స్టూడెంట్స్ హిజాబ్‌ ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Highlights

Supreme Court: హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థినులకు అనుమతించిన కోర్టు

Supreme Court: కాలేజీల్లో హిజాబ్‌ ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థినులకు అనుమతించింది. కళాశాల క్యాంపస్‌లలో విద్యార్థులు హిజాబ్‌లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. హిజాబ్‌పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసుపై గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీం స్టే విధించింది. విద్యార్థినులు ఏం ధరించాలో కాలేజీలు నిర్ణయిస్తే మహిళా సాధికారికత మాటేంటని ప్రశ్నించింది. కళాశాలలో అందరూ సమానమని, మతాల ప్రదర్శనకు అది వేదిక కాకూడదనే ఉద్దేశంతోనే తాము హిజాబ్‌ని నిషేధించామని.. కళాశాల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దీనిపై కోర్టు స్పందిస్తూ.. పేర్లల్లో కూడా మతం ఉంటుందని.. మరి దాన్ని ఎలా తొలగిస్తారని కళాశాల యాజమాన్యాన్ని తిరిగి ప్రశ్నించింది. "అమ్మాయిలు ఏం ధరించాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని అభిప్రాయపడింది కోర్టు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకుపైనే అవుతున్నా.. ఇప్పటికీ ఇలాంటి అంశాలపై చర్చ రావడం దురదృష్టకరమని, తాముఇచ్చిన ఉత్తర్వులను దుర్వినియోగం చేయకూడదని కోర్టు తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories