Supreme Court on Freebies: ఈ ఉచితాలు ఎంత కాలం... ఉపాధి కల్పించలేరా? - కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్

Supreme Court on Freebies: ఈ ఉచితాలు ఎంత కాలం... ఉపాధి కల్పించలేరా? - కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్
x
Highlights

Supreme Court on Freebies: 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అందజేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎంతకాలం ఉచితంగా వస్తువులను...

Supreme Court on Freebies: 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అందజేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎంతకాలం ఉచితంగా వస్తువులను ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు, సామర్థ్యాల పెంపుదలపై మనం ఎందుకు పని చేయకూడదని కోర్టు పేర్కొంది. ఈ కేసుపై కోర్టు ఇతర కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ ఉచితాలు ఇంకెంతకాలం...ఉపాధి కల్పించలేరా అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్ దగ్గర నుంచి వలస కార్మికులకు ఫ్రీ రేషన్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి..నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 కింద 81 కోట్ల మందికి ఉచితంగా గానీ, రాయతీపైన గానీ రేషన్ పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది.

కేంద్రం మాటలు విన్న ధర్మాసనం ఆశ్చర్యపోయింది. పన్ను చెల్లింపుదార్లనే విడిచిపెట్టారు అంటూ వ్యాఖ్యానించింది. కోవిడ్ సమయంలో వలస కార్మికుల సమస్యలపై సుమోటోగా చేపట్టిన వ్యాజ్యంపై సోమవారం అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది.

ఓ స్వచ్చంద సంస్థ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషన్ వాదనలు వినిపించారు. కోవిడ్ సమయంలో ఈ శ్రమ్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికులకు కూడా ఫ్రీగా రేషన్ ఇచ్చారంటూ..దాన్ని కొనసాగించాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. ఇంకెంత కాలం ఉచితాలు కొనసాగిస్తారు. వారికి ఉపాధి ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించింది.

ఉచిత వస్తువులను ఎప్పటి వరకు ఇవ్వగలం? ఈ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు, సామర్థ్యాన్ని పెంపొందించడంపై మనం ఎందుకు పని చేయకూడదు? వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని, కేంద్రం అందించే ఉచిత రేషన్ ప్రయోజనాలను పొందేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ కోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తోందని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఎవరికైనా రేషన్‌కార్డు లేకుంటే, ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లయితే, వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌ను అందజేస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories