Supreme Court: నేడు లఖీంపూర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court Hearing on Lakhimpur Kheri Incident Today 7th October 2021 | National News
x

సుప్రీంకోర్టు (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*వాదనలు విననున్న జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం *లఖీంపూర్‌ ఘటనపై రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ

Supreme Court - Lakhimpur Kheri: ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. కాగా, ఈ కేసును స్వీకరించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది. కేసు విషయంలో యూపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి యూపీ న్యాయవాదులు లేఖ రాశారు.

దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టేలా కేంద్రహోంశాఖకు ఆదేశాలు జారీ చేయాలని, ఈ హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారికి చట్టపరంగా శిక్షపడేలా చూడాలని వారు కోరారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories