బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు

బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు
x
Highlights

బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు కూల్చివేత కేసు తుది తీర్పునకు ఆగస్ట్‌ 31లోపు డెడ్‌లైన్ విధించింది

బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు కూల్చివేత కేసు తుది తీర్పునకు ఆగస్ట్‌ 31లోపు డెడ్‌లైన్ విధించింది. జ‌స్టిస్ ఫారీమ‌న్‌, సూర్య కంత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలిచ్చింది.. ల‌క్నోలోని ట్రయ‌ల్ కోర్టు జ‌డ్జి.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా త్వర‌గా కేసును విచారించాల‌ని సుప్రీం పేర్కొంది. ఈ కేసులో మొత్తం 32 మంది విచార‌ణ ఎదుర్కొంటున్నారు.

వారిలో ప్రముఖ బిజెపి నాయకులు ఎల్కె అద్వానీ, ముర్లి మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి, సిట్టింగ్ ఎంపిలు బ్రిజ్ భూషణ్ సింగ్, సాక్షి మహారాజ్ ఉన్నారు.1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కూల్చడం జరిగింది. ఆ తర్వాత అయోధ్యలో రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి బాబ్రీ మసీదు కూల్చడంలో కుట్రకోణం దాగి ఉందని, రెండోది బాబ్రీ మసీదును కూల్చాల్సిందిగా ప్రజలను రెచ్చగొట్టారని చెబుతూ కేసు నమోదైంది.దాదాపు 28 ఏళ్ల పాటు కోర్టుల్లో విచారణ సాగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు తాజాగా తెరపైకి తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ఉన్న భూమిని అక్కడ ఒక శ్రీరామ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించే ట్రస్ట్‌కు కేటాయించాలని గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు అయోధ్యలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories