BS4 Vehicle Registration STOP: ఆ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌ను నిలిపివేయండి : సుప్రీం

BS4 Vehicle Registration STOP: ఆ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌ను నిలిపివేయండి : సుప్రీం
x
Supreme Court Bans BS4 Vehicle Registration Till Further Notice
Highlights

BS4 Vehicle Registration STOP: సుప్రీంకోర్టు బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు లాక్‌డౌన్ కాలంలో అమ్మిన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లను జరుపరాదని న్యాయస్థానం స్పష్టంచేసింది

BS4 Vehicle Registration STOP: సుప్రీంకోర్టు బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు లాక్‌డౌన్ కాలంలో అమ్మిన బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లను జరుపరాదని న్యాయస్థానం స్పష్టంచేసింది. మార్చిలో పెద్ద సంఖ్యలో ఈ వాహనాల అమ్మకంపై జస్టిస్ అరుణ్శర్మ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అనుమానాలు వ్యక్తం చేసింది. బీఎస్-4 వాహనాలకు తుది గడువు మార్చి 31గా నిర్దేశిస్తే, తర్వాత కూడా బీఎస్-4 వాహనాల అమ్మకాలు కొనసాగాయని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ఆగస్టు 13న విచారణ చేపడతామని ప్రకటించింది.

లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా బీఎస్-4 వెహికిల్స్ మిగిలిపోయాయంటూ ఆటోమొబైల్ డీలర్లు కోర్టును ఆశ్రయించ‌డంతో.. జూన్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఆటో డీలర్లకు(ఫాడా) సడలింపునిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 10 రోజుల వ్యవధిలో 10 శాతం వాహనాలను మాత్రమే అమ్మేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తాము నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ మొత్తంలో BS4 వాహనాలు అమ్ముడు కావడం సుప్రీం కోర్టును అసహనానికి గురిచేసింది. అయితే బీఎస్‌-4 వాహనాలను అమ్మ‌కాలు నిబంధనలకు విరుద్ధంగా జ‌రిగిన‌ట్టు తమ దృష్టికి వచ్చిందని కోర్టు తెలిపింది. మార్చి 27 తర్వాత 2.55 లక్షల బీఎస్‌-4 వాహనాలు అమ్ముడయ్యాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో 1.05 లక్షల బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రమే కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో బీఎస్-4 రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తాజా ఆదేశాలను శుక్రవారం జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories