సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
x
Highlights

పార్లమెంట్‌ నూతన భవనంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సచివాలయం నిర్మించడానికి ఉద్దేశించిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌...

పార్లమెంట్‌ నూతన భవనంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సచివాలయం నిర్మించడానికి ఉద్దేశించిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టప్రకారమే ఉందని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సరిగ్గానే ఉన్నాయని కోర్టు తెలిపింది. ఐతే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్‌ టవర్లు ఏర్పాటు చేయాలని, యాంటీ స్మాగ్‌ గన్నులను ఉపయోగించాలని ఆదేశించింది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిర్మాణాలకు హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ కమిటీ అనుమతి అవసరమని వెంటనే అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయ్. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్, స్థలం కేటాయింపు వంటి వాటిని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం గతంలో విచారణ చేపట్టింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్‌ చేసింది. ఇవాళ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు వెల్లడించింది. కేంద్రం వాదనలతో జస్టిస్‌ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ మహేశ్వరీ ఏకీభవించగా జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా వ్యతిరేకించారు. దీంతో 2-1 మెజార్టీతో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories