NEET: నీట్ విషయంలో ఎన్టీఏపై మండిపడ్డ సుప్రీంకోర్టు

Supreme Court angry with NTA regarding NEET
x

NEET: నీట్ విషయంలో ఎన్టీఏపై మండిపడ్డ సుప్రీంకోర్టు

Highlights

NEET: 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా స్పందించాలి

NEET: నీట్‌ పరీక్ష విషయంలో జాతీయ పరీక్ష మండలి NTAపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే.. సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని వ్యాఖ్యానించింది. ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా... దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా... న్యాయంగా వ్యవహరించాలని సూచించింది. ఏదైనా తప్పిదం జరిగితే... తప్పు జరిగిందని అంగీకరించాలని... ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వివరించాలని తెలిపింది. కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తోందని పేర్కొంది. NTA నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామన్న ధర్మాసనం... తదుపరి విచారణను జులై 8న చేపడతామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories