Prank Video: క్లాస్‌లో ప్రొఫెసర్‌తో ప్రాంక్ వీడియో.. కోట్లమంది చూస్తున్న వీడియో

Prank Video: క్లాస్‌లో ప్రొఫెసర్‌తో ప్రాంక్ వీడియో.. కోట్లమంది చూస్తున్న వీడియో
x
Highlights

Students Prank Video With Professor: సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలకు భారీ స్పందన కనిపిస్తోంది. దీంతో ప్రాంక్ వీడియోలు చేసేందుకు ఇన్‌ఫ్లూయెన్సర్స్,...

Students Prank Video With Professor: సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలకు భారీ స్పందన కనిపిస్తోంది. దీంతో ప్రాంక్ వీడియోలు చేసేందుకు ఇన్‌ఫ్లూయెన్సర్స్, నెటిజెన్స్ కూడా విపరీతంగా పోటీపడుతున్నారు. అందులో యువత సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ముక్కుమొహం తెలియని వారిపై ప్రాంక్ వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం ఒక రకం. తమకు బాగా తెలిసిన వారినే ఆటపట్టించి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మరో రకం. ఈ తరహా ప్రాంక్ వీడియోలకు ఆధరణ కూడా ఎక్కువగానే ఉంటుండంతో యువత ప్రాంక్ వీడియోల మేకింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది.

తాజాగా ఒక తరగతి గదిలో ప్రొఫెసర్‌పై స్టూడెంట్స్ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టూడెంట్స్ ప్రాంక్ చేస్తున్నారని తెలియని ఆ ప్రొఫెసర్.. వారితో సరదాగా కలిసిపోయి అడ్డంగా బుక్కయ్యారు. అది ప్రాంక్ వీడియో అని తెలిశాకా ఇందులో నేను కూడా ఉన్నానా అంటూ వచ్చి పక్కన కూర్చున్నారు. ఇంకేం.. ఈ ప్రాంక్ వీడియో చేసిన తీరు నెటిజెన్స్‌కి బాగా నచ్చడంతో కోట్లమంది జనం ఈ వీడియోను వీక్షిస్తున్నారు. ఇప్పటికే 35.6 మిలియన్ల నెటిజెన్స్ ఈ ప్రాంక్ వీడియోను వీక్షించగా మరో 36 లక్షల మంది నెటిజెన్స్ లైక్ చేశారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. క్లాస్‌లో ప్రొఫెసర్ ఉండగానే ఇద్దరు అమ్మాయిలు ఆయన దృష్టిని ఆకర్షించేలా వాగ్వాదానికి దిగారు. వారు బిగ్గరగా అరుస్తుండటంతో ప్రొఫెసర్ అక్కడికి చేరుకున్నారు. ఏమైంది, ఎందుకు గొడవ పడుతున్నారు అని ప్రశ్నించారు. అందుకు ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక స్టూడెంట్ స్పందిస్తూ.. సర్, "యూ ఈజ్ స్లీప్" అని అనడం కరెక్ట్ అవుతుందా లేక "యూ కెన్ స్లీప్" అని అనడం కరెక్ట్ అవుతుందా చెప్పండి అని అడిగారు. అందుకు ఆ ప్రొఫెసర్ ఏ మాత్రం తడుముకోకుండా "యూ కెన్ స్లీప్" అని బదులిచ్చారు. ప్రొఫెసర్ అలా బదులిచ్చారో లేదో వెంటనే క్లాస్ రూమ్‌లో ఉన్న స్టూడెంట్స్ అంతా తమ ముందున్న బెంచిలపై తలలు వాల్చి నిద్రపోతున్నట్లుగా ఫోజిచ్చారు. అందుకు కారణం ఆ ప్రొఫెసర్ నోట్లోంచి యూ కెన్ స్లీప్ అని రావడమే.

ఒక్కసారే క్లాస్ రూమ్ అంతా అలా రియాక్ట్ అయ్యేసరికి ఏం జరుగుతుందో ఆ ప్రొఫెసర్‌కి అర్థం కాలేదు. ఏమైనా సోషల్ ఎక్స్‌పరిమెంట్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తూ క్లాస్ రూమ్ అంతా తిరిగి చూశారు. అంతలోనే ఒక స్టూడెంట్ వీడియో రికార్డ్ చేస్తుండటం కనిపించింది. ఆ సీన్ చూశాకా ప్రొఫెసర్‌కి మొత్తం స్టోరీ అర్థమైపోయింది. తనపైనే ప్రాంక్ వీడియో ప్రయోగించారు అని అర్థం చేసుకున్న ప్రొఫెసర్.. ఆగ్రహం తెచ్చుకోకుండా సరదాగా వారితో కలిసిపోతూ ఏంటి ఇప్పుడు ఈ రీల్‌లో నేను కూడా ఉన్నానా అంటూ కెమెరా ముందుకొచ్చి హాయ్ చెప్పారు.

వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి Students prank video with professor

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రాంక్ వీడియోపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చదువులు చెప్పే గురువులతో పరాచికాలు ఏంటని కొందరు ప్రశ్నిస్తే.. గురువు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారే అంటూ ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. బెంగళూరులోని క్రీస్తు యూనివర్శిటీలో ఈ ప్రాంక్ వీడియో షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories