నమ్మలేని నిజం: చితి నుంచి బతికొచ్చిన మనిషి

నమ్మలేని నిజం: చితి నుంచి బతికొచ్చిన మనిషి
x
Highlights

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఎవరూ నమ్మలేని ఒక సంఘటన జరిగింది.

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఎవరూ నమ్మలేని ఒక సంఘటన జరిగింది. వ్యక్తి చనిపోయాడనుకుని అంత్యక్రియలకు తీసుకెళ్ళాక చితినుంచి ఆ వ్యక్తిలేచాడు. ఆ సంఘటన వివరాల్లోకెలితే ఒడిశాలోని గంజాం జిల్లా లావుఖా గ్రామానికి చెందిన సిమాంచల్ మల్లిక్ (52) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇతను శనివారం అంత జ్వరంలోనూ తన మేకలను మేపేందుకు అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు.

సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినా మల్లిక్ మాత్రం రాలేదు. దీంతో గాభరాపడిన కుటుంబ సభ్యులు అడవిలోకి వెళ్లి అతడి కోసం గాలించారు. ఆదివారం ఉదయం అడవిలో ఓ చోట పడి ఉన్న మల్లిక్‌ను గుర్తించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతన్ని లేపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అతనికి చలనం లేకపోవడంతో చనిపోయాడని భావించారు. ఇంటికి తీసుకెళ్లి బంధువులకు, గ్రామస్థులకు సమాచారం అందించి అంతిమ సంస్కారాలకు సిద్ధమయ్యారు.

అనంతరం సాయంత్రం శ్మశానానికి తీసుకెళ్లి చితి పేర్చారు. దహనానికి సిద్ధమవుతున్న సమయంలో మల్లిక్‌లో కదలికలు ప్రారంభమయ్యాయి. చితికి నిప్పు పెట్టేందుకు సిద్ధమవుతుండగా శ్వాస తీసుకుంటున్న వ్యక్తిని చూసి బంధువులు సహా అక్కడనున్న వారంతా షాకయ్యారు. ఆశ్చర్యం నుంచి తేరుకుని వెంటనే అతన్నిచితిపై నుంచి కిందకి దింపి ఆసుపత్రికి తరలించారు. ఇది తెలిసిన జనం అతడిని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories