భారత్‌లో మూడో దశ కరోనా ముప్పు.. థర్డ్ వేవ్‌కు ముందస్తు ఏర్పాట్లు

States Preparing for Corona third wave in India
x

కరోనా వైరస్ (రెప్రెసెంటేషనల్ ఇమేజ్ )

Highlights

Coronavirus: ఇప్పటికే భారత్‌ను కరోనా అతలాకుతలం చేస్తోంది.

Coronavirus: ఇప్పటికే భారత్‌ను కరోనా అతలాకుతలం చేస్తోంది. మొదటి వేవ్ కంటే సెకెండ్ వేవ్ బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. అంతేస్థాయిలో మరణాలు కూడా సంభవించాయి. అయితే ఇలానే ఉంటే మూడో ముప్పు తప్పదంటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు. ఫస్ట్, సెకెండ్ వేవ్ అనుభావాల దృష్ట్యా థర్డ్ వేవ్ కు ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపించే ఛాన్స్ ఉందన్న హెచ్చరికలతో పిల్లల వార్డులు, మందుల నిల్వలపై రాష్ట్రాలు దృష్టి పెట్టాయి.

కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు మరిన్ని కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లను నెలకొల్పే యత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. ఈక్రమంలోనే పన్నెండేళ్లలోపు పిల్లలు ఉండే తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమిస్తామని యూపీ ప్రభుత్వం రీసెంట్‌గా ప్రకటించింది. రెండేళ్లలోపు పిల్లలున్నవారు, బాలింతలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమివ్వాలని గోవా సర్కార్ యోచిస్తోంది. మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల కరోనా చికిత్సకు ప్రత్యేక వార్డుల ఏర్పాటు సన్నాహాలు చేయాలని ఆదేశించింది.

తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పిల్లల కోవిడ్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ప్రొటొకాల్ రూపకల్పనపై కసరత్తులు ప్రారంభించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సాంగ్లి నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లలకు కరోనా చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటివారంకల్లా కరోనా మూడో వేవ్ మొదలుకావొచ్చనే అంచనాల నేపథ్యంలో రెండు నెలల ముందే దాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌తో దేశంలోనే తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్ర, ఆ చేదు అనుభవాలు ప్రాతిపదికగా భవిష్యత్తులో పొంచి ఉన్న మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు పకడ్బందీగా వ్యూహాలను రచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories