పాత సంవత్సరానికి బై చెబుతూ, నూతన సంత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకోసం అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది.
పాత సంవత్సరానికి బై చెబుతూ, నూతన సంత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకోసం అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది. ఈ ఆఫర్ కి ఇయర్ ఎండ్ బ్లాస్ట్ అనే పేరును కూడా పెట్టింది. సంస్థకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ను వేదికగా చేసుకుని ఇయర్ ఎండ్ బ్లాస్ట్ ఆఫర్లను ప్రకటించింది. 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇయర్ ఎండ్ బ్లాస్ట్‌కు రెడీగా ఉండండి' అంటూ ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఇక ఇయర్ ఎండ్ బ్లాస్ట్ ఆఫర్ లో పర్సనల్ గోల్డ్ లోన్స్‌ను అన్ని బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే అందిస్తుంది. అంతే కాదు ఈ లోన్ కు డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అంతే కాదు కార్ లోన్స్‌పై తగ్గింపు, జీరో ప్రాసెసింగ్ ఫీజు ప్రయోజనం కూడా ఉంది. ప్రిఅప్రూవ్డ్ పర్సనల్ లోన్ సదుపాయం కూడా ఉంది. ఇంత మంచి ఆఫర్లను ఎవరైనా పోగొట్టుకుంటారా లేదు కదా. ఇప్పుడే ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లను మీ సొంతం చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న ఎస్ బీఐ బ్రాంచ్ కు వెళ్లండి.
ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నవారు. ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. డెబిట్ కార్డు ఈఎంఐ అర్హత తెలుసుకోవడానికి DCEMI అని టైప్ చేసి 567676 నెంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ సెండ్ చేయాలి. తరువాత PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎస్‌బీఐ అకౌంట్ చివరి నాలుగు అక్షరాలు ఎంటర్ చేసి 567676కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మరో ఎస్ఎంఎస్ పంపించాలి. ఈ విధంగా చేసుకుంటే మీకు బ్యాంక్ ఏ ఆఫర్లను అందిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Get ready to start your New Year with SBI's Year End Blast! There are exciting offers to look forward to, from Car loans, Pre-approved Personal loans, Gold loans and on-the-spot Debit Card EMIs. Click here for more details:- https://t.co/rtjaIeXXcF pic.twitter.com/XlMeJVJWxT
— State Bank of India (@TheOfficialSBI) December 20, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire