Air India: ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ లో తొక్కిసలాట.. నిరుద్యోగులతో కిక్కిరిసిన ముంబయి

Stampede in Air India Recruitment Drive
x

Air India: ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ లో తొక్కిసలాట.. నిరుద్యోగులతో కిక్కిరిసిన ముంబయి

Highlights

Air India: దేశంలో నిరుద్యోగం ఏ రీతిలో ఉందో చెప్పడానికి ఈ వీడియో చూస్తే అర్థమవుతుందనడంలో అతిశయోక్తి లేదు.

Air India: దేశంలో నిరుద్యోగం ఏ రీతిలో ఉందో చెప్పడానికి ఈ వీడియో చూస్తే అర్థమవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆరు వందల ఎయిర్‌పోర్ట్ లోడర్ ఉద్యోగాల కోసం ఎయిర్‌ ఇండియా నిర్వహించిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు వేల సంఖ్యలో నిరుద్యోగులు రావడం తొక్కిసలాటకు దారి తీసింది. ముంబై కలీనాలోని ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో మంగళవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగింది.

ఆ క్రమంలో భారీ సంఖ్యలో ఉద్యోగార్థులు రావడంతో తొక్కిసలాట జరిగింది. అక్కడికి చేరుకున్న అభ్యర్థులు ఫారమ్ కౌంటర్‌లను చేరుకోవడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. దీంతో ఆ పరిసర ప్రాంతం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. గంటల తరబడి నిలబడి ఉండడంతో చాలా మంది అస్వస్థతకు గురయ్యారని కొందరు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories