టెన్త్‌క్లాస్‌తో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. జీతం రూ.60 వేల పైమాటే.. అస్సలు మిస్సవ్వద్దు..!

SSC GD Constable Recruitment 2022 Chek For All Details
x

టెన్త్‌క్లాస్‌తో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. జీతం రూ.60 వేల పైమాటే.. అస్సలు మిస్సవ్వద్దు..!

Highlights

*టెన్త్‌క్లాస్‌తో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. జీతం రూ.60 వేల పైమాటే.. అస్సలు మిస్సవ్వద్దు..!

SSC GD Constable Recruitment 2022: నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కేంద్ర సాయుధ బలగాల ఉద్యోగ నోటిఫికేషన్ రానే వచ్చింది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ssc) 24,369 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), ఎస్‌ఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)లో సిపాయి పోస్టులను భర్తీ చేస్తారు.

ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి పాస్‌ అయితే సరిపోతుంది. మహిళా/పురుష అభ్యర్ధులు ఎవరైనా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులు 157 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. అంటే జనవరి 2, 2000 కంటే ముందు జవనరి 1, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు.

ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు వయసు విషయంలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకి ఆన్‌లైన్‌లో నవంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్ధులు రూ.100 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ప్రతిభకనబరచిన వారికి సిపాయి పోస్టులకైతే నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900 వరకు, ఇతర పోస్టులకు రూ.21,700ల నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) పోస్టులు: 10497

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌) పోస్టులు: 100

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌) పోస్టులు: 8911

సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ) పోస్టులు: 1284

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) పోస్టులు: 1613

అస్సాం రైఫిల్స్(ఏఆర్‌) పోస్టులు: 1697

సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌) పోస్టులు: 103

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) పోస్టులు: 164

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 30, 2022.

ఆఫ్‌లైన్ చలానా చెల్లింపులకు చివరి తేదీ: నవంబర్‌ 30, 2022.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2022.

చలాన్ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2022.

రాత పరీక్ష తేదీ: జనవరి, 2023.

Show Full Article
Print Article
Next Story
More Stories