దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణామి వేడుకలు

Sri Krishna Janmashtami Celebrations Across the Country
x

దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణామి వేడుకలు 

Highlights

Sri Krishna Janmashtami 2022: కృష్ణుడిని దర్శించుకునేందుకు ఆలయలకు పోటెత్తిన భక్తులు

Sri Krishna Janmashtami 2022: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణామి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున శ్రీకృష్ణుడి ఆలయాలకు వెళ్తున్నారు. తమ ఆరాధ్య దైవమైన కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని లక్ష్మి నారాయణ్ దేవాలయంలో శ్రీకృష్ణుడికి బంగారం పూతతో తయారుచేసిన ఊయలను భక్తులు స్వామివారికి బహుకరించారు. 200 గ్రాముల బంగారం, 7 కిలోల వెండితో ఊయలను తయారు చేశామని ఆలయ నిర్వాహ‌కులు తెలిపారు. భక్తులు ఇచ్చిన 50 లక్షల రూపాయలతో బంగారు ఊయలను తయారు చేపించామని తెలిపారు.

శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ముద్దులొలికే శ్రీకష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. మరోవైపు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉట్టిని కొట్టేందుకు యువకులు పోటీపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories