South Central Railway: తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు ప్రారంభం

South Central Railway Says Several Trains Canceled Due to Corona Will be Running From Today 17 06 2021
x

South Central Railway: (File Image) 

Highlights

South Central Railway: కరోనా తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ మళ్లీ పలు రైళ్ల సర్వీసులను పట్టాలెక్కిస్తోంది.

South Central Railway: కరోనా కారణంగా ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో రైళ్లను తిరగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు భారతీయ రైల్వే పేర్కొంది. పలు రూట్లలో తాత్కాలికంగా రద్దు చేసిన ప్రత్యేక సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు సర్వీసులను రైల్వే శాఖ పునరుద్ధరించింది. వాటి వివరాలు ... లింగంప‌ల్లి-విజ‌య‌వాడ ఇంట‌ర్‌సిటీ రైలు, కాచిగూడ – రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు-కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, లింగంప‌ల్లి-విజ‌య‌వాడ ఇంట‌ర్‌సిటీ రైలు ను సైతం బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories