First Cargo Express : త్వరలో దక్షిణ మధ్య రైల్వే 'కార్గో ఎక్స్‌ప్రెస్‌' ప్రారంభం

First Cargo Express : త్వరలో దక్షిణ మధ్య రైల్వే కార్గో ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం
x
Highlights

First Cargo Express: దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే ప్రప్రథమంగా 'కార్గో ఎక్స్‌ప్రెస్‌' ను ప్రారంభించ‌బోతుంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలును...

First Cargo Express: దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే ప్రప్రథమంగా 'కార్గో ఎక్స్‌ప్రెస్‌' ను ప్రారంభించ‌బోతుంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలును దాదాపు ఆరునెలల పాటు పైలట్‌ ప్రాజెక్టు కింద నడపనున్నట్టు దక్షిణ‌మ‌ధ్య రైల్వే వెల్లడించింది. ఈ కొత్త విధానం వలన చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తుందని దక్షిణమ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ 'కార్గో ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ మరియు ఢిల్లీ మధ్య టైమ్‌టేబుల్ ప్రకారం నడుస్తుంది. హైదరాబాద్‌లోని సనత్ నగర్ నుంచి ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ వరకు తన కార్యకలాపాలను సాగిస్తుంది. ఇది రెండు నగరాల మధ్య పెద్దమొత్తంలో వస్తువులను రవాణా చేస్తుంది. వారంలో ప్రతి బుధవారం ఇది సరుకుల రవాణా చేస్తుంది.

వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, కార్గో మూవర్స్, చిన్న మరియు మధ్యతరహా / మినీ ప్లాంట్ యజమానులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, వారు తమ సరుకును తక్కువ సుంకాలతో అవరమైన ప్రాంతాలకు తరలించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ రైలు వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని భావించాకే.. మరికొన్ని రైళ్లలో కార్గో సేవలు ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఈ రైలును పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని అన్నారు. తాము అంచనా వేసిన దాని ప్రకారం కంటే దీనివలన మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories