Sonu Sood: ఇంటికే ఆక్సిజన్ మిషన్ ను పంపిన సోనూ సూద్

Sonu Sood Send Oxygen Mission to Corona Patient Home in Hyderabad
x

Sonu Sood Send Oxygen Mission

Highlights

Sonu Sood: హైదరాబాద్‌కు చెందిన ఓ కరోనా బాధితుడి ఇంటికి నేరుగా ఆక్సిజన్‌ మిషన్ ను పంపారు.

Sonu Sood: కరోనా అయినా కాటు వేసి వేసి అలిసిపోతుందేమో గాని.. సోనూ సూద్ మాత్రం సాయం చేయడంలో ఎలాంటి అలసట చూపించడం లేదు. రోజురోజుకు ప్రజల మనసుల్లో సోనూ సూద్ స్థానం పెరిగిపోతుందే గాని తరిగిపోవటం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఓ కరోనా పేషెంట్ కు ఆక్సిజన్ సిలిండర్ పంపి ..వారిని ఆదుకున్నాడు సోనూ సూద్.

పేద, ధనిక, కుల, మత, ప్రాంయ బేధాలు లేకుండా ఏ రాష్ట్రమైనా.. ఏ గ్రామమైనా సరే ఎవరైనా సాయం కావాలని అడిగితే.. కాదు లేదు కుదరదనకుండా సోనూ... తన చేతనైన సాయం చేస్తాడు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ కరోనా బాధితుడి ఇంటికి నేరుగా ఆక్సిజన్‌ సిలిండర్‌నే పంపారు. నల్లకుంటకు చెందిన రాఘవ శర్మ(75) అనే వ్యక్తి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయన హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. రాఘవ శర్మలో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోగా సాయం చేయాలంటూ అతడి కొడుకు లక్ష్మినారాయణ ట్విట్టర్‌ ద్వారా సోనూ సూద్‌ను కోరారు.

ఈ ట్వీట్‌కు స్పందించిన స్పందించిన సోనూసూద్‌ తన చారిటీ ఫౌండేషన్‌ ద్వారా ఏకంగా ఆక్సిజన్‌ యంత్రాన్ని ఇంటికి పంపించాడు. గురువారం రాత్రి బతుకమ్మకుంట గోకుల్‌ స్వీట్‌ షాప్‌ ఎదురు వీధిలో ఉన్న రాఘవ శర్మ ఇంటికి కొరియర్‌ ప్రతినిధి వెళ్లి వారికి ఆక్సిజన్‌ మిషన్‌ అందజేయడంతో రాఘవ కుటుంబ సభ్యులు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన సోనూసూద్ అభిమానులు, నెటిజన్లు ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories