Sonia Gandhi Resignation: అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా

Sonia Gandhi Resignation: అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా
x
Highlights

Sonia Gandhi resign as interim Congress President : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సోమవారం జరిగిన...

Sonia Gandhi resign as interim Congress President : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ తన నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగలేనని, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె స్పష్టం చేశారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు. పార్టీలో సమర్ధవంత‌మైన‌ నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా అసంతృప్తికి లోనయిన‌ట్లు స‌మాచారం. కాగా మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్, మ‌రో సీనియ‌ర్ నేత ఏకే ఆంటోనిలు సోనియానే అధ్య‌క్షురాలిగా కొన‌సాగాల‌ని కోరుతున్నారు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్ గాంధీ కూడా విముఖంగా ఉండడంతో ఇక పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరవుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories