అశోక్ గెహ్లాట్ తీరుపై సోనియాగాంధీ తీవ్ర అసంతృప్తి

Sonia Gandhi is Very Unhappy with Ashok Gehlots Behavior
x

అశోక్ గెహ్లాట్ తీరుపై సోనియాగాంధీ తీవ్ర అసంతృప్తి

Highlights

*తన వర్గానికి చెందిన శాసనసభ్యులకు నచ్చచెప్పకపోవడంతో గెహ్లాట్‌పై సోనియా అసహనం

Congress: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీరుపై సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని ప్రశ్నించడం పట్ల గెహ్లాట్ వర్గ శాసన సభ్యులపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన వర్గానికి చెందిన శాసనసభ్యులకు నచ్చచెప్పకపోవడంతో గెహ్లాట్‌పై సోనియాగాంధీ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉందని, ఆయనను ఏఐసీసీ అధ్యక్షపదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ కమిటీ సోనియాకు సిఫార్సు చేశారు. ఇక ఇదిలా ఉండగా రాజస్థాన్ పరిణామాలను చక్కదిద్దడానికి సీనియర్ నేత కమల్‌నాథ్ ను అధిష్టానం రంగంలోకి దించనుంది.

ఇందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ సోనియా గాంధీని కలవనున్నారు. పార్టీ నేతలతో చర్చించిన తర్వాత వేణుగోపాల్‌ను కేరళ నుంచి ఢిల్లీకి పంపించారు రాహుల్ గాంధీ. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభంపై అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్‌తో సహా పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలు మహేశ్ జోషి, శాంతి ధరివాల్‌లకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక చర్యలకు ఎందుకు పాల్పడ్డారని? శాసనసభపక్ష సమావేశాన్ని పిలిచిన ఆదివారం ఎందుకు సమావేశానికి గైర్హాజరు అయ్యారని? శాసనసభ్యులతో ఎందుకు సమావేశం నిర్వహించారని నేతలను ప్రశ్నించనున్న అధిష్టానం.

Show Full Article
Print Article
Next Story
More Stories