ISRO: ఉత్సాహంగా శాస్త్రవేత్తలు.. అంగారక.. శుక్ర గ్రహాలపై వెళ్లే సత్తా ఉందన్న సోమనాథ్

Somanath Said ISRO Has Ability To Go To The Planets Mars And Venus
x

ISRO: ఉత్సాహంగా శాస్త్రవేత్తలు.. అంగారక.. శుక్ర గ్రహాలపై వెళ్లే సత్తా ఉందన్న సోమనాథ్

Highlights

ISRO: అంతరిక్ష పరిశోధనలపై మోదీకి ప్రణాళికలున్నాయన్న సోమనాథ్

ISRO: భారత్‌కు చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల పైకి వెళ్లే సత్తా ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. అయితే ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమని తెలిపారు. చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల పైకి వెళ్లి పరిశోధనలు చేసే సత్తా ఉందన్నారు. అందుకు మన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలన్నారు. దీంతో దాంతోపాటు అంతరిక్ష పరిశోధనలకు పెట్టుబడుల అవసరం కూడా ఉందన్నారు. దీని వల్ల అంతరిక్ష పరిశోధన రంగంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని సోమనాథ్ అన్నారు.

అలాగే దేశ అంతరిక్ష రంగ అభివృద్ధి గురించి ప్రధాని మోడీకి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని సోమనాథ్ తెలిపారు. ప్రధాని తమకు నిర్దేశించిన భవిష్యత్తు లక్షాలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సోమనాథ్ వెల్లడించారు. కేరళ లోని తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సోమనాథ్ సందర్శించారు. విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అనే పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించారు.

జీవితంలో సైన్స్, ఆధ్యాత్మికం రెండు అంశాల పట్ల తనకు ఆసక్తి ఉందని తెలిపారు. అందుకే వివిధ ఆలయాలను సందర్శించడంతోపాటు అనేక గ్రంథాలను చదివి విశ్వంలో మనిషి మనుగడకు ఉన్న నిజమైన అర్థాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. చంద్రయాన్ 3 లో ల్యాండర్,రోవర్ పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. వాటి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని , రాబోయే రోజుల్లో వివిధ మోడల్‌లలో ల్యాండర్, రోవర్ పనితీరును పరీక్షించాల్సి ఉందని తెలిపారు. అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories