Chennai: చెన్నైలో పాముల బెడద..మూడు రోజుల్లో 94పాములు పట్టకున్న..

Snakes are Entering into the Houses Due to Heavy Floods in Chennai
x

చెన్నైలో భారీ వరదల కారణంగా ఇళ్లలోకి చేరుతున్న పాములు

Highlights

Chennai: ఇటీవల భారీ వర్షాలకు ఇళ్లలోకి చేరిన పాములు

Chennai: వరదలతో ముంచెత్తిన చెన్నై నగరంలో మరో ప్రమాదం పొంచి ఉంది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వర్షపు నీరు సముద్రంలోకి చేరినా అందులోంచి కొట్టుకొచ్చిన పాములు బుసలు కొడుతున్నాయి. వరద వల్లా ఏర్పడిన బురదల్లో పాములు చేరి ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి.

గత మూడు రోజుల్లో 94 పాములను గుర్తించి వాటిని అడవుల్లో విడిచిపెట్టారు. 30మంది పాములు పట్టే బృందం ఈ పనిలో నిమగ్నమయ్యారు. చెన్నై, వేళచ్చేరి, పల్లికర్ణై, సిడ్లపాకమ్, వలసరవాక్కం, విరుకంబాకం సహా 161 ప్రదేశాల్లో పాములున్నట్లు మహానగర పాలక సంస్థకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. చాలా చోట్ల ఎటువంటి సమాచారం లేకుండా వాటిని చంపేస్తున్నారు స్థానికులు. దీంతో చెన్నైలో పాముల సమస్యను పరిష్కరించడం కోసం కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories