రైతులకి గమనిక.. ఈ ప్రభుత్వ సబ్సిడీని అస్సలు వదిలిపెట్టకండి..!

Smam Kisan Yojana 2022 Subsidy on Agricultural Equipment | Farmers Schemes in India
x

రైతులకి గమనిక.. ఈ ప్రభుత్వ సబ్సిడీని అస్సలు వదిలిపెట్టకండి..!

Highlights

Smam Kisan Yojana 2022: భారతదేశంలో అధిక సంఖ్యలో ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతారు...

Smam Kisan Yojana 2022: భారతదేశంలో అధిక సంఖ్యలో ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతారు. నేటికీ దేశంలోని అధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారి జీవితం వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ జిడిపిలో వ్యవసాయ రంగం 17 నుంచి 18 శాతం వాటాను అందిస్తుంది. అందుకే ప్రభుత్వం రైతులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల ద్వారా రైతులకు తక్కువ ధరకు ఎరువులు, పనిముట్లు మొదలైన వస్తువులను అందిస్తున్నాయి. ఇది కాకుండా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వంటి పథకాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది.

Smam కిసాన్ యోజన ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చు?

దేశంలో సాగు చేస్తున్న ఏ రైతు అయినా స్మామ్‌ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మహిళా రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికింద వ్యవసాయానికి ఉపయోగించే ఆధునిక పరికరాల ధరపై మార్కెట్ రేటులో దాదాపు 50 నుంచి 80 శాతం సబ్సిడీ ఇస్తుంది. అధిక దిగుబడి కోసం వ్యవసాయంలో ఆధునిక పరికరాలను ఉపయోగించమని ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంది. ఈ పరిస్థితిలో పేద రైతులు కూడా ఈ వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం ఈ పరికరాలపై ఈ సబ్సిడీ ఇస్తోంది.

పథకం ప్రయోజనం పొందేందుకు అర్హత

ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులకు ప్రభుత్వం ఈ పథకం ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. దీనివల్ల రైతులు వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడం సులువవుతుంది. రిజర్వ్ చేయబడిన వర్గం ఈ పథకం గరిష్ట ప్రయోజనాన్ని పొందుతుంది. రైతులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ పరికరాలపై దాదాపు 50 నుంచి 80 శాతం వరకు రాయితీ పొందవచ్చు. మీరు కూడా వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే ఈ పథకానికి అప్లై చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories