Swati Maliwal: అతడు నన్ను కాలితో తన్నాడు.. సున్నిత భాగాలపై కొట్టాడు..

Slapped Multiple Times, hit on Stomach Says Swati Malliwal in FIR
x

Swati Maliwal: అతడు నన్ను కాలితో తన్నాడు.. సున్నిత భాగాలపై కొట్టాడు..

Highlights

Swati Maliwal: అతడు నన్ను కాలితో తన్నాడు.. సున్నిత భాగాలపై కొట్టాడు..

Swati Maliwal: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దాడి ఘటనపై స్వాతి మాలీవాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదులో స్వాతి మలివాల్‌ సంచలన ఆరోపణలు చేశారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. బిభవ్‌ కుమార్‌ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు స్వాతి మలివాల్‌ పేర్కొన్నారు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపించారు. 7-8 సార్లు చెంపదెబ్బలు కొట్టి, కడుపుపై బలంగా కొట్టాడని, పొత్తికడుపుపై పదేపదే తన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను పీరియడ్స్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కర్రతో పలు మార్లు బాదినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories