Six Minute Walk Test Covid: పిల్లలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వద్దు

Six Minute Walk Test and no Remdesivir Center Guidelines For Covid Management In Children
x

Center’s Guidelines For Covid Management In Children:(The Hans India)

Highlights

Six Minute Walk Test Covid: కరోనా సోకిన పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది

Six Minute Walk Test Covid: కరోనా లక్షల ప్రాణాలను బలి తీసుకుంది. ప్రాణాలను కాపాడుకోవడానికి.. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన సమయంలో.. అది పెంచడానికి రెమ్ డెసివర్ ఇంజెక్షన్లు వాడారు. అవి వాడాకే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి.. కొందరు బయటపడ్డారు. కాని మరికొందరు ఈ ఇంజెక్షన్ల వల్ల వచ్చిన ఎఫెక్టులతో తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుంది. ఈ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. పిల్లలకు కరోనా సోకితే.. రెమ్ డెసివర్ మాత్రం వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. రెమ్ డెసివర్, స్టెరాయిడ్ మెడిసిన్స్ పిల్లలకు వాడితే.. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారులు కోవిడ్ ప్రభావితమయితే దానికి సంబంధించిన చికిత్స, నిర్వహణ పద్దతులను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) బుధవారం ఈ మేరకు తాజాగా జారీ చేసింది.

కరోనా సోకిన చిన్న పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది. పిల్లలకు కచ్చితంగా అవసరమైతేనే, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో హై-రెజల్యూషన్‌ సీటీ స్కాన్‌ను తీయించాలని సూచించింది. స్టెరాయిడ్లను కూడా దాదాపు వాడవద్దన్న ఆరోగ్యశాఖ, అత్యంత క్రిటికల్ అనుకున్న కేసుల్లో మాత్రమే స్టెరాయిడ్లను ఆప్షన్ గా భావించాలన్నారు. లక్షణాలులేని, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారికి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని, వీటివల్ల హానికరమని కేంద్రం పేర్కొంది.

కరోనా సోకిన తర్వాత, తక్కువ, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారిలో జ్వరం తగ్గేందుకు ప్రతి 4-6 గంటలకు ఒకసారి పారాసిటమాల్‌ 10-15ఎంజీ/కేజీ/డోసు ఇవ్వొచ్చని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది. పిల్లలకు కరోనా టెస్టులకు సంబంధించి.. గదిలో పిల్లలు ఆరు నిమిషాల పాటు నడిచాక, పల్స్‌ ఆక్సీమీటర్‌ సాయంతో వారి ఆక్సిజన్‌ స్థాయులు తెలుసుకోవాలని, ఆక్సిజన్‌ సమస్య తలెత్తితే వైద్యుల్ని సంప్రదించాలని పేర్కొంది.

ఇక, తీవ్రమైన కోవిడ్ అనారోగ్యం ఉన్న సందర్భాల్లో.. ఆక్సిజన్ చికిత్సను వెంటనే ప్రారంభించాలి. ద్రవ పదార్ధాలను ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కొనసాగించాలి. కార్టికోస్టెరాయిడ్స్ చికిత్సను ప్రారంభించాలని కేంద్ర సూచించింది. "స్టెరాయిడ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన వ్యవధిలో వాడాలి" అని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories