Gujarat: గుజరాత్ మోర్బీ వంతెన ప్రమాదంపై సిట్ నివేదిక

SIT Report On Morbi Bridge Accident In Gujarat
x

Gujarat: గుజరాత్ మోర్బీ వంతెన ప్రమాదంపై సిట్ నివేదిక

Highlights

Gujarat: ప్రమాదానికి ముందే వంతెన తీగలు తెగిపోయి ఉండొచ్చన్న సిట్

Gujarat: గతేడాది గుజరాత్‌లో జరిగిన మోర్బీ వంతెన ప్రమాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వంతెనను నిలిపివుంచే ఓ కేబుల్‌లో సగానికి పైగా ఇనుప వైర్లు తుప్పుపట్టిపోయాయని నివేదికలో పేర్కొంది. వంతెనపై పాత సస్పెండర్లను కొత్త వాటితో కలుపుతూ చేసిన వెల్డింగ్‌కు కూడా తుప్పుపట్టిందని వెల్లడించింది. ప్రమాదానికి దారి తీసిన కారణాల్లో ఇవి ప్రధానమైనవని తెలిపింది. అలాగే, వంతెనకు ఆధారమైన రెండు ప్రధాన కేబుళ్లలో ఒకదానిలోని ఇనుప వైర్లు ప్రమాదానికి ముందే తెగిపోయి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ మేరకు సిట్ తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను గత డిసెంబర్‌లోనే ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. మోర్బీలోని మచ్ఛు నదిపై నిర్మించిన ఈ తీగల వంతెన గతేడాది అక్టోబర్ 30న కూలిపోయిన 135 మంది చనిపోయారు. బ్రిటీష్ కాలంనాటి వంతెన మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను ఒరెవా గ్రూప్ చేపట్టింది. ఇందులో చాలా లోపాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒరెవా గ్రూప్ ఎండీ సహా మొత్తం పది మందిని అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories