సెప్టెంబర్‌లో అందుబాటులోకి స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్

Single Dose Sputnik Light Shows 93.5% Efficacy Against Covid
x

సెప్టెంబర్‌లో అందుబాటులోకి స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్

Highlights

Sputnik Light: సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది.

Sputnik Light: సింగిల్ డోస్ కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ తో ఒప్పందం చేసుకున్న పనాసియా బయోటెక్ స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రలో ఆఫ్ ఇండియా అనుమతి కోరింది. వ్యాక్సిన్ ధర 750 రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఏప్రిల్ 12న అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందింది. దీనిని ప్రస్తుతం 65 దేశాల్లో వినియోగిస్తున్నారు. భారత్‌లో మే లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్ అండ్ రష్యన్ డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వ్యాక్సిన్ 97.5 శాతం ప్రభావంతంగా పని చేస్తుందని RDFI ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories