పార్టీ ఏదైనా.. గెలుపు మాత్రం ఆయనదే.. ఒకే స్థానం నుంచి 8 సార్లు గెలుపు..

Shyam Sunder Sharma The Man From Mant Who Can’t Be Defeated
x

పార్టీ ఏదైనా.. గెలుపు మాత్రం ఆయనదే.. ఒకే స్థానం నుంచి 8 సార్లు గెలుపు.. 

Highlights

Shyam Sunder Sharma: శ్యామ్‌ సుందర్‌ శర్మ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పేరు మార్మోగుతోంది.

Shyam Sunder Sharma: శ్యామ్‌ సుందర్‌ శర్మ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పేరు మార్మోగుతోంది. మధుర జిల్లాలోని మంట్‌ నియోజకవర్గం నుంచి 8 సార్లు పోటీ చేసి గెలిచిన వీరుడతను. కృష్ణుకంటే ఎక్కువ ప్రజలను గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉంటే తానే అంటున్నారీ 72 ఏళ్ల శర్మ.

రాజకీయాల్లో ఎంత గొప్ప నేత అయినా అప్పుడప్పుడూ తప్పదు ఓటమి. కానీ యూపీలోని మధుర జిల్లా మంట్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్యామ్‌ సుందర్‌ శర్మ మాత్రం అందుకు విరుద్ధం. 1989 నుంచి మంట్‌ స్థానం నుంచి వరుసగా ఎనిమిదిసార్లు పోటీ చేసిన ఆయన ఇప్పటివరకు ఓడిపోలేదు. తాజాగా బీఎస్పీ అభ్యర్థిగా యూపీ ఎన్నికల్లో తొమ్మిదో సారి శర్మ మళ్లీ పోటీ చేస్తున్నారు.

శ్యామ్‌ సుందర్‌ శర్మ 1989 నుంచి బీఎస్పీలో లేరు. తరచూ పార్టీలు మారుతున్న శర్మ స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. మొదట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన శర్మ ఆ తరువాత ఇండిపెండెంట్‌గా, తృణముల్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2017లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే మంట్‌ నియోజకవర్గ ప్రజలు మాత్రం పార్టీని చూడకుండా శర్మను మాత్రమే చూసి ఓట్లేసి ఆయన్నే గెలిపిస్తున్నారు. అయితే 2012లో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి చేతిలో ఓడిపోయినా రెండు నెలల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచాడు.

2017లో మధుర జిల్లాలో అన్ని సీట్లను బీజేపీ కొల్లగొట్టగా ఒక్క మంట్‌ స్థానంలో మాత్రం మళ్లీ శర్మనే గెలిచాడు. ఈసారి ఎన్నికల్లో బీఎస్పీగా అభ్యర్థిగా తొమ్మిదోసారి బరిలో దిగారు శర్మ. కృష్ణుడి కంటే ప్రజలను ఎక్కువగా ఎవరైనా గౌరవిస్తున్నారంటే అది తానేనని చెబుతున్న శర్మ తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేస్తారంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories