Sanjay Singh Masani Appointed as MP congress Vice President: ఉపఎన్నికల ప్రచార బాధ్యతను ముఖ్యమంత్రి బావమరిదికి ఇచ్చిన కమల్ నాథ్

Sanjay Singh Masani Appointed as MP congress Vice President: ఉపఎన్నికల ప్రచార బాధ్యతను ముఖ్యమంత్రి బావమరిదికి ఇచ్చిన కమల్ నాథ్
x
madhya pradesh
Highlights

మధ్యప్రదేశ్ లో తన అధీనంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ భావిస్తున్నారు.

Shivraj Singh Chouhan's brother-in-law appointed state MP Congress vice-president: మధ్యప్రదేశ్ లో తన అధీనంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ భావిస్తున్నారు. అందులో భాగంగా శివరాజ్ సింగ్ సొంత బావమరిది సంజయ్ సింగ్ మసానిని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అంతేకాదు మసానిని ప్రాంతీయ సమన్వయకర్తగా .. రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికలలో ప్రచార ఇన్‌చార్జిగా నియమించారు. ఆయనకు కేటాయించిన నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహిస్తారని..కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారని కార్యకర్తలకు కమల్ నాథ్ సూచించారు. కాగా కమల్ నాథ్ నిర్ణయంతో బీజేపీ నేతలు షాక్ అయ్యారు. సొంత బావమరిది.. బావకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి సంజయ్ సింగ్

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే శివరాజ్ సింగ్ తో విభేదించి కాంగ్రెస్ లో చేరారు. దాంతో ఆయనను బాలాఘాట్ జిల్లాలోని వరసివాని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేయించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తారని అందరూ భావించారు. సంవత్సరం గడిచినా.. ప్రభుత్వం పడిపోయేంతవరకూ పదవి రాలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంతో రాజినామా చేసిన ఎమ్మెల్యేల రూపంలో ఆయనను మళ్ళీ గుర్తించారు. ఆయనకు ప్రచార బాధ్యతల తోపాటు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టారు కమల్ నాథ్. అయితే ఇదంతా శివరాజ్ సింగ్ కుటుంబంలో చిచ్చుపెట్టడానికే కమల్ నాథ్ చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories