రాష్ట్రంలో మహిళ పోలీసులు లేరా.. యోగీజీ ?

రాష్ట్రంలో మహిళ పోలీసులు లేరా.. యోగీజీ ?
x
Highlights

MP Sanjay Raut Fire On Up Government : హత్రాస్‌లో అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా వెళ్ళగా అక్కడ ఆమె పైన యూపీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం పట్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు దుమారం చెలరేగుతుంది.

MP Sanjay Raut Fire On Up Government : హత్రాస్‌లో అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా వెళ్ళగా అక్కడ ఆమె పైన యూపీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం పట్ల దేశవ్యాప్తంగా ఇప్పుడు దుమారం చెలరేగుతుంది. తాజాగా దీనిపైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఓ పోలీసు.. ప్రియాంక గాంధీ కుర్తాను పట్టుకుని లాగడంపై విమర్శలు గుప్పించారు. 'యోగిజీ మీ పాలనలో అసలు మహిళా పోలీసులే లేరా?' అని రౌత్ ప్రశ్నించారు. మహిళా నాయకురాలు అని చూడకుండా యూపీ పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. జాతీయ నాయకురాలికే ఇలా జరిగితే.. ఇక సామాన్యుల పరిస్థితి యూపీ పోలీసుల చేతుల్లో ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే బాధితురాలు కుటుంబాన్ని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నిన్న పరామర్శించారు. ప్రియాంక గాంధీ బాధితురాలి తల్లిని ఓదార్చి, కుటుంబానికి అండగా నిలుస్తామని అన్నారు. " బాధితురాలు కుటుంబం చివరిసారిగా వారి కుమార్తెను చూడలేకపోయింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన బాధ్యతను అర్థం చేసుకోవాలి. న్యాయం జరిగే వరకు, మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము" అని ప్రియాంకా వెల్లడించారు. దుఃఖంతో ఉన్న కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పక రక్షించాలని రాహుల్ గాంధీ అన్నారు.

దీనికి ముందు యూపీ పోలీసులు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను కొద్దిసేపు నిర్భందించారు. 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్‌కు కాంగ్రెస్ కాన్వాయ్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో పాటుగా మరో అయిదుగురు కాంగ్రెస్ నాయకులకి బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించే అవకాశాన్ని పోలీసులు కలిపించారు. దీనితో సాయంత్రం 6.45 గంటలకు హత్రాస్ చేరుకున్న వారు ఒక గంట పాటు బాధితురాలు కుటుంబంతో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories