సీఎం పోస్టు కోసం బీజేపీతో బంధాన్ని తెంచుకున్న శివసేన

Shiv Sena Sever ties with BJP for CM Post | Maharashtra Political Crisis
x

సీఎం పోస్టు కోసం బీజేపీతో బంధాన్ని తెంచుకున్న శివసేన 

Highlights

*2019 నవంబర్ 26న కుప్పకూలిన ఫడ్నవిస్ ప్రభుత్వం

Maharashtra Political Crisis: సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం 2019 నవంబర్ 23న సీఎం పోస్ట్ కోసం బీజేపీతో శివసేన బంధం తెంచుకుంది. అప్పట్లో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. కొద్ది మంది సమక్షంలో రాజ్ భవన్ లో హడావుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫడ్నవిస్ ప్రభుత్వం కేవలం 80 గంటల మనుగడ సాగించింది. 2019 నవంబర్ 26న ఫడ్నవిస్ ప్రభుత్వం కుప్పకూలింది. రెండు రోజుల తర్వాత ఉద్దవ్ థాక్రే మహారాష్ర్ట సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నవంబర్ 22-23 అర్ధరాత్రి జరిగిన పరిణామాలు మాహారాష్ట్ర రాకీయాలను మలుపులు తిప్పాయి. శివసేన తన మిత్రపక్షం బీజేపీ నుంచి దూరం అయ్యింది. మూడు దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకుంది. సైద్దాంతికంగా శత్రువులుగా భావించే కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టింది. మూడు పార్టీలతో మహా వికాస్ అఘాడీ పేరుతో కొట్ట కూటమి ఏర్పాటయ్యింది. కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

2019 ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. బీజేపీ 105, శివసేన 56, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. సీఎం పదవి విషయంలో బీజేపీ-శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం పోస్టు తమకే దక్కాలంటూ ఇరుపక్షాలు భీష్మించుకున్నాయి. శివసేన పట్టు వీడకపోవడంతో బీజేపీ పాచిక విసిరింది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవర్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరారు. ఆయనకు డిప్యూటీ సీఎంపదవి దక్కింది. మూడు రోజుల వ్యవధిలోనే బీజేపీ రాంరాం అంటూ మళ్లీ శరద్ పవార్ కు జైకొట్టారు. పవార్ మంత్రాంగంతో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పురుడు పోసుకుంది. ఉద్దవ్ ఠాక్రే సీఎం అయ్యారు. రెండున్నరేళ్ల పాటు సాఫీగా సాగిన ప్రయాణంలో హఠాత్తుగా సంక్షోభం తలెత్తింది. చివరకు ఉద్దవం థాక్రే పదవి నుంచి దిగి పోవాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories