Sheikh Hasina: షేక్ హసీనాకు యూకే ఆశ్రయం ఇస్తుందా? అప్పటి వరకు భారత్ లోనే హసీనా?

Sheikh Hasina was in India until the UK gave her asylum
x

Sheikh Hasina: షేక్ హసీనాకు యూకే ఆశ్రయం ఇస్తుందా? అప్పటి వరకు భారత్ లోనే హసీనా?

Highlights

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూకేలో ఆశ్రయం కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్ నిర్ణయం తీసుకునేంత వరకు హసీనా..భారత్ లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. హసీనా భారత్ కు వస్తున్న విమానాన్ని భారత్ నిరంతరం పర్యవేక్షిస్తూ..రఫేల్ విమానాలతో రక్షణ కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి.

Sheikh Hasina:రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం వీడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్ కు వచ్చారు. కొంతకాలం ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు హసీనాకు భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా లండన్ లో ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. దీనిపై బ్రిటన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యూకే సర్కార్ నుంచి అనుమతులు వచ్చేంత వరకు హసీనా భారత్ లో ఉండేందుకు ప్రభుత్వం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో హసీనాకు భారత్ సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్ స్పందించింది. గత రెండు వారాలుగా అల్లర్ల కారణంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణనష్టంపై ఐక్యరాజ్యసమితి నేత్రుత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరింది. ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో షేక్ హసీనాకు అశ్రయమిచ్చే అంశాన్ని ప్రస్తావించలేదు.

రఫేల్ యుద్ధ విమానాలతో..

భారత వాయుసేన రాడార్లు బంగ్లా గగనతలాన్ని నిరంతరం పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు గమనించిన భద్రతా బలగాల..ఈ విమానంలో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టిన అధికారులు దాన్ని భారత్ లోకి అనుమతించాలని ఆదేశించారు. పైగా ఆ విమానానికి రక్షణ కల్పించేందుకు బంగ్లాలోని హసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్క్వాడ్రన్ లోని రఫేల్ యుద్ద విమానాలు బయలు దేరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బిహార్, జార్ఖండ్ మీదుగా అవి రాఫేల్ విమానాలు రక్షణ కల్పించాయి.

కాగా షేక్ హసీనా విమానం గాజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో సాయంత్రం 5.45 గంటలకు దిగింది. ఆమెను జతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఆహ్వానించి..అక్కడే గంట సేపు చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు సహా భవిష్యత్ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి పరిస్థితిని ఆయన వివరించారు. కాగా బంగ్లాదేశ్ సంక్షోభంపై నేడు ఉదయం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories