కరోనా చికిత్సలో మంచి పనితీరు కనబరుస్తున్న మలేరియా యాంటీ డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయకపోతే భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామన్న అమెరికా...
కరోనా చికిత్సలో మంచి పనితీరు కనబరుస్తున్న మలేరియా యాంటీ డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయకపోతే భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు.
"ఓ దేశాధినేత మరో దేశాన్ని ఇలా బహిరంగంగా బెదిరించడం ఎప్పుడూ చూడలేదు. అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయ వ్యవహారాలను పరిశీలిస్తున్నాను. ఎవరూ ఇంతటి దుందుడుకుతనంతో వ్యవహరించలేదు. మిస్టర్ ప్రెసిడెంట్... హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేయాలని గట్టిగా అడుగుతున్నారు, కానీ భారత్ అమ్మదలుచుకుంటేనే అవి మీకు సరఫరా అవుతాయన్న విషయం గమనించాలి" అంటూ మండిపడ్డారు.
అయితే కరోనా వైరస్ విలయతాండవం నేపథ్యంలో భారత్ పెద్దమనసుతో వ్యవహరించింది. క్లోరోక్విన్ సహా అవసరమైన ఇతర ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది.
Never in my decades of experience in world affairs have I heard a Head of State or Govt openly threatening another like this. What makes Indian hydroxychloroquine "our supply", Mr President? It only becomes your supply when India decides to sell it to you. @USAndIndia https://t.co/zvSPEysTNf
— Shashi Tharoor (@ShashiTharoor) April 7, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire