Maharashtra: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ప్రకంపనలు

Sharad Pawar says Mumbi Police ex-chief’s claims need thorough probe
x

Maharashtra: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ప్రకంపనలు

Highlights

Maharashtra: ముంబయి మాజీ సీపీ పరమ్​బీర్‌ సింగ్‌ ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Maharashtra: ముంబయి మాజీ సీపీ పరమ్​బీర్‌ సింగ్‌ ఆరోపణలు అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్సీపీ నేత, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ పరమ్‌వీర్‌ సింగ్‌ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. హోంమంత్రికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనకు దిగారు. హోంమంత్రి పదవీకి రాజీనామా చేయాలంటూ డిమాండ్ వినిపిస్తోంది.

పరమ్‌వీర్‌ సింగ్‌ ఆరోపణలపై చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ పార్టీ సీనియర్‌ మంత్రులతో భేటీ అయ్యారు. వారితో పాటు శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కూడా శరద్‌పవార్‌ను కలిశారు.

మహారాష్ట్ర పోలీస్ అధికారి సచిన్ వాజే అరెస్ట్‌ ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఎన్‌సీపీ శరద్‌పవార్ స్పందించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై సీపీ పరమ్‌ బీర్ చేసిన అవినీతి ఆరోపణలు తీవ్రమైనవన్నారు. హోంమంత్రిపై చర్యలు తీసుకునే అధికారం సీఎంకు ఉందన్నారు. హోంమినిస్టర్ పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలన్నారు.

నగరంలోని బార్లు, హుక్కా సెంటర్ల నుంచి నెలకు 100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులకు హోంమంత్రి టార్గెట్ ఇచ్చారని ఆరోపిస్తూ పరమ్‌వీర్‌ సీఎం ఠాక్రేకు లేఖ రాశారు. అంతేకాకుండా తనను బదిలీ చేయడం వెనక కారణాలనూ ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఓ అధికారి రాసిన లేఖ సంకీర్ణ ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories