పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానని యువకుడి కేకలు..

Shagun Sharma who was Declared Dead After Undergoing Treatment was Found Alive
x

పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానని యువకుడి కేకలు..

Highlights

Shagun Sharma: చనిపోయాడనుకున్న ఓ యువకుడు తాను బతికే ఉన్నానని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Shagun Sharma: చనిపోయాడనుకున్న ఓ యువకుడు తాను బతికే ఉన్నానని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. పోస్టుమార్టం గదిలోకి తరలిస్తున్న సమయంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ వైద్యకాలేజీలో ఈ ఘటన జరిగింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ జిల్లా గోట్కా గ్రామానికి చెందిన షగుణ్ శర్మ తన సోదరుడితో కలిసి అక్టోబర్ 30న బైక్ పై వెళ్తున్న సమయంలో మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న సోదరులు గాయపడ్డారు. షగుణ్ శర్మ పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మేరఠ్ వైద్యకాలేజీకి తరలించారు.

చికిత్స అందిస్తున్న సమయంలో ఆయన చనిపోయారని వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం కోసం స్ట్రెచర్ పై ఆయనను తరలిస్తున్న సమయంలో నేను బతికే ఉన్నా అని శర్మ గట్టిగా కేకలు వేశారు. దీంతో వైద్యులతో పాటు సిబ్బంది షాకయ్యారు. వెంటనే ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. షగుణ్ శర్మ బతికున్నా ఎలా చనిపోయారని ప్రకటించారని శర్మ బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతంపై మేరఠ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్సీ గుప్తా విచారణకు ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories