Delhi Pollution: రాజధానిని కమ్మేసిన పొగమంచు..హస్తినకు ఆరెంజ్ అలర్ట్.

Delhi Pollution: రాజధానిని కమ్మేసిన పొగమంచు..హస్తినకు ఆరెంజ్ అలర్ట్.
x
Highlights

Delhi Pollution: ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ మరింత పడిపోయింది. దీంతో దేశరాజధానిలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 150 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో మొత్తం AQI నేడు 481 వద్ద నమోదైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో 490 అంతకంటే ఎక్కువ నమోదైంది. అధ్వాన్నంగా మారుతున్న కాలుష్య పరిస్థితుల దృష్ట్యా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో GRAP-4 అమలు చేశారు.

Delhi Pollution: దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యంతోపాటు పొగమంచు కూడా నానాటికీ పెరిగిపోతుంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచీ 481కిచేరుకుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో ఆరెంజ్ అలర్జ్ జారీ చేశారు. పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో 150మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.

అయితే కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 490 అంతకంటే ఎక్కువ వద్ద నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది కాకుండా, నోయిడా AQI 384 వద్ద, గురుగ్రామ్ AQI 468 వద్ద నమోదైంది. ఈ నగరాల్లో కాలుష్య పరిస్థితి అధ్వాన్యంగా ఉంది. దీని కారణంగా ఢిల్లీ-NCR ప్రాంతంలో ఆరోగ్య సంబంధిత ముప్పులు కూడా పెరిగాయి.

గాలి నాణ్యతలో ఈ క్షీణత కారణంగా, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నాల్గవ దశ అంటే GRAP-4 ఢిల్లీ-NCR ప్రాంతంలో అమలు చేశారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB), ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన ఈ పథకం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కఠినమైన చర్యలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ముఖ్యంగా AQI 400 కంటే ఎక్కువ ఉన్నప్పుడు... GRAP- 4 కింద, నిర్మాణ పనులు నిలిపివేయడం, నిర్మాణ స్థలం నుండి దుమ్ము ఎగరకుండా కఠిన చర్యలు తీసుకోవడం, వాహనాల సంఖ్యను తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటారు.

అదే సమయంలో, భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో దట్టమైన పొగమంచును అంచనా వేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. IMD ప్రకారం, పొగమంచు కారణంగా దృశ్యమానత 200 మీటర్లకు పడిపోవచ్చని పేర్కొంది.

ఇది రహదారి, రైలు, విమాన ట్రాఫిక్‌ను ప్రభావితం చేయవచ్చు. సోమవారం పగటిపూట పొగమంచుతో పాటు పొగలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలని, విమాన, రైల్వే ప్రయాణాలకు సంబంధించి ఎటువంటి జాప్యం లేదా అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు సమాచారం పొందాలని వాతావరణ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories