Kolkata Doctor Rape And Murder Case: కోల్‌కతా హత్యాచార ఘటనలో సంచలన విషయాలు.. పక్కా ప్లాన్ ప్రకారమే

Sensational things in the Kolkata murder incident
x

Kolkata Doctor Rape And Murder Case: కోల్‌కతా హత్యాచార ఘటనలో సంచలన విషయాలు.. పక్కా ప్లాన్ ప్రకారమే

Highlights

Kolkata Doctor Rape And Murder Case: హత్యాచారానికి ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలోనే ఉన్నాడని గుర్తింపు

Kolkata Doctor Rape And Murder Case: కోల్‌కతా హత్యాచార ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారమే.. హత్యాచారానికి పాల్పడినట్టు దర్యాప్తులో వెలుగుచూస్తోంది. హత్యాచారానికి ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలోనే ఉన్నాడని, బాధిత వైద్యురాలిపై రెక్కీ నిర్వహించినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా తెలుస్తోంది. నేరానికి ఒకరోజు ముందు ఉదయం 11 సమయంలో నిందితుడు రాయ్‌ ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోని చెస్ట్‌ మెడిసన్‌ వార్డ్‌లో ఉన్నట్లు ఒప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో అదే వార్డులో బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ వైద్యులు ఉన్నారని తెలిపాయి.

వారిని నిందితుడు గమనిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైందని చెప్పాయి. ఆ నలుగురు జూనియర్‌ వైద్యుల వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసినట్లు సమాచారం. ఈ కేసులో సామూహిక హత్యాచారం జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్​ఏ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది. ఘటన జరిగిన రోజు ఆగస్టు 9న తెల్లవారుజామున ఒంటిగంటకు బాధితురాలు ఆస్పత్రిలోని సెమినార్‌ హాల్‌లోకి వెళ్లినట్లు ఆధారాలు చెబుతున్నాయి. నిందితుడు రాయ్‌ 4 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలిసింది. ఆ సమయంలోనే నేరం జరిగి ఉండొచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. విచారణలో సమయంలో దారుణానికి ఒడిగట్టిన నిందుతుడిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories