Bihar Reservations: 65% రిజర్వేషన్లు రద్దు.. పట్నా హైకోర్టు సంచలన తీర్పు

Sensational judgment of Patna High Court
x

Bihar Reservations: 65% రిజర్వేషన్లు రద్దు.. పట్నా హైకోర్టు సంచలన తీర్పు

Highlights

Bihar Reservations: 65శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యంగ విరుద్దమన్న పాట్నా హైకోర్టు

Bihar Reservations: రిజర్వేషన్ల పెంపుపై బిహార్‌లోని నీతీశ్ కుమార్ ప్రభుత్వానికి...హైకోర్టులో చుక్కెదురైంది. దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతులకు... విద్యా, ఉద్యోగాల్లో 50శాతం ఉన్న రిజర్వేషన్లను 65శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది నవంబర్‌లో రిజర్వేషన్లను 50శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ...బిహార్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పట్నా హైకోర్టు...మార్చిలో విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం...తీర్పును వాయిదావేసింది. రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ ఇవాళ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్ల చట్టాన్ని సవరించటం రాజ్యాంగ ఉల్లంఘన అని...పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories