Uttar Pradesh: యూపీ కాంగ్రెస్‌కు మరో దెబ్బ

Senior Congress Leader RPN Singh Quits Party
x

Uttar Pradesh: యూపీ కాంగ్రెస్‌కు మరో దెబ్బ

Highlights

Uttar Pradesh: యూపీ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. ముఖ్యనేతలంతా పార్టీని క్రమంగా వీడుతున్నారు.

Uttar Pradesh: యూపీ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. ముఖ్యనేతలంతా పార్టీని క్రమంగా వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత, మాజీ మంత్రి ఆర్పీఎన్‌ సింగ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కమలం గూటికి చేరిన ఆయన కొత్త రాజకీయ ప్రయాణం మొదలయిందంటూ వ్యాఖ్యానించారు.

2017లో పాద్రౌనా నియోజకవర్గంలో మాజీ మంత్రి, ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్‌ మౌర్య చేతిలో ఆర్పీఎన్‌ సింగ్‌ ఓడిపోయారు. ఆర్పీఎన్‌ సింగ్‌కు పాద్రౌనా నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ ఇవ్వనున్నట్టు సమాచారం.

సైంత్వార్‌ రాజ్‌పుత్‌ అయిన ఆర్పీఎన్‌ సింగ్ తండ్రి సీపీఎన్‌ సింగ్‌ నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటూ వచ్చారు. యూపీలోని కౌషినగర్ జిల్లాలో ఆర్పీఎన్‌ సింగ్‌కు మంచి పట్టు ఉంది. యూపీలో జితిన్‌ ప్రసాద్‌ తరువాత మరో అగ్రనాయకుడిని కాంగ్రెస్‌ కోల్పోయింది. ఇది కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories