Bandh : విద్యార్థులకు బిగ్ అలర్ట్..జులై 4న పాఠశాలలు బంద్ ..ఎందుకో తెలుసా?

Bandh : విద్యార్థులకు బిగ్ అలర్ట్..జులై 4న పాఠశాలలు బంద్ ..ఎందుకో తెలుసా?
x

Bandh : విద్యార్థులకు బిగ్ అలర్ట్..జులై 4న పాఠశాలలు బంద్ ..ఎందుకో తెలుసా?

Highlights

Bandh : పాఠశాల, కాలేజీ విద్యార్థులకు అలర్ట్. జులై 4వ తేదీన స్కూల్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాటు జులై4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి.

Bandh :వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. గత నెలలో స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో చదివేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు జులై 4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. ఎన్టీఏను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని ఎస్ఐఎఫ్, ఏఎస్ఐఎఫ్, పీడీఎస్ యూ, పీడీఎస్ ఓ, ఎన్ఎస్ యూఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత 5ఏండ్లలో 65పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని..దీనిపై పార్లమెంట్ లో ప్రధాని మోదీ చర్చింది న్యాయం చేయాలని కోరాయి. లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారని తెలిపాయి.

దేశంలో విద్యావ్యవస్థపై దాడికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జులై 4న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపు ఇచ్చాయి. విద్యార్థి లోకం బంద్ లో పాల్గొని, తరగతులను బహిష్కరించి, ర్యాలీలు, నిరసనలు తెలపాలని పిలునిచ్చాయి. కాగా 8 డిమాండ్లపై ఈ బంద్ జరుగుతుంది. ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలని, నీట్ పరీక్షలు రాసిన విద్యార్ధులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories