మరాఠా కోటా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే..

మరాఠా కోటా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే..
x
Highlights

2020-21 మరాఠా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు , కళాశాల ప్రవేశాలలో రిజర్వేషన్లను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర..

2020-21 మరాఠా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు , కళాశాల ప్రవేశాలలో రిజర్వేషన్లను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. లార్జర్ బెంచ్ మరాఠా కోటా యొక్క ప్రామాణికతను నిర్ణయిస్తుందని కోర్టు తెలిపింది. 2018లో నాటి బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లకు అసలు చట్టబద్ధత ఉందా లేదా అనే అంశాన్ని విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (సెబిసి) చట్టం, 2018,

మహారాష్ట్రలోని మరాఠా వర్గానికి చెందినవారికి ఉద్యోగాలు , పరిపాలనలలో రిజర్వేషన్లు కల్పించడానికి రూపొందించబడింది. గత ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్లు సమర్థించదగినవి కాదని, ఉపాధిలో 12 శాతం, ప్రవేశాలలో 13 శాతం మించరాదని పేర్కొంది. దీంతో కోర్టు సూచించిన దాని ప్రకారం మాత్రమే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. కాగా అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించకూడదని సుప్రీంకోర్ట్ తెలిపిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories