ప్రధాని మోడీ ఎన్నికను సవాల్ చేసిన తేజ్ బహదూర్

ప్రధాని మోడీ ఎన్నికను సవాల్ చేసిన తేజ్ బహదూర్
x
Highlights

వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్...

వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ నుంచి డిస్మిస్ అయిన కానిస్టేబుల్ తేజ్ బహదూర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.

అంతకుముందు తేజ్ బహదూర్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. తేజ్ బహదూర్ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గ ఓటరు కాదని, నరేంద్ర మోదీపై ఆయన పోటీ చేయలేదని చెప్తూ, ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై తేజ్ బహదూర్ సుప్రీంకోర్టులో అపీలు చేశారు. తేజ్ బహదూర్ వారణాసి నుంచి మోడీపై పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయన నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఎన్నికల కమిషన్‌కు తేజ్ బహదూర్ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ చర్య తీసుకుంది. తేజ్ బహదూర్ 2017లో విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించింది. సైనికులకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఈ వీడియోలో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories