SBI Alerts: ఎస్బీఐ అలర్ట్‌.. ఆ పనిచేయని ఖాతాదారుల అకౌంట్లు నిలిపివేసే అవకాశం..!

sbi alerts customers aadhaar pan linked before 31 march
x

SBI Alerts: ఎస్బీఐ అలర్ట్‌.. ఆ పనిచేయని ఖాతాదారుల అకౌంట్లు నిలిపివేసే అవకాశం..!

Highlights

SBI Alerts: ఎస్బీఐ అలర్ట్‌.. ఆ పనిచేయని ఖాతాదారుల అకౌంట్లు నిలిపివేసే అవకాశం..!

SBI Alerts: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) తమ ఖాతాదారులను హై అలర్ట్‌లో ఉంచాయి. ఈ పని చేయకపోతే వారి బ్యాంకింగ్ సేవలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నాయి. 31 మార్చి 2022లోపు పాన్-ఆధార్ కార్డ్‌ని లింక్ చేయాలని ఈ రెండు బ్యాంకులు ఖాతాదారులకు నోటీసులు ఇచ్చాయి. ఒకవేళ ఇది జరగకపోతే వారు బ్యాంకు లావాదేవీలు నిర్వహించలేరని పేర్కొన్నాయి. సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించాయి.

మార్చి 31 వరకు అవకాశం SBI మాట్లాడుతూ.. ' బ్యాంకు సేవలు నిరంతరాయంగా కొనసాగాలంటే ఖాతాదారులు ఆధార్‌తో పాన్‌కార్డ్‌ లింక్ చేసుకోవాలి. దీంతో పాటు పాన్‌కార్డుని ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్‌కార్డు పనిచేయదు. నిర్దిష్ట లావాదేవీలను నిర్వహించడానికి ఉపయోగించరాదు' అని తెలిపింది. కరోనా వైరస్ దృష్ట్యా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు 30 సెప్టెంబర్ 2021 నుంచి 31 మార్చి 2022 వరకు పొడిగించింది.

పాన్-ఆధార్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలి..

1. ముందుగా మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్ https://www.incometaxindiaefiling.gov.in/home కి వెళ్లండి.

2. అక్కడ ఎడమ వైపున మీకు లింక్ ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

3. కొత్త పేజీ కనిపిస్తుంది ఓపెన్ చేయండి. అక్కడ మీరు ఆధార్‌లో రాసిన విధంగా పాన్, ఆధార్, మీ పేరును నమోదు చేయాలి.

4. మీ ఆధార్ కార్డ్‌లో పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే 'ఆధార్ కార్డ్‌లో నాకు పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంది' అనే బాక్స్‌పై టిక్ చేయాలి.

5. క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయాలి. మొబైల్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.

6. అంతే పాన్, ఆధార్ లింక్ అయినట్లు సందేశం వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories