Narendra Modi: సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ!

Saudi Arabia Crown Prince Mohammed Bin Salman Meets PM Modi
x

Narendra Modi: సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ!

Highlights

Narendra Modi: న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశం

Narendra Modi: భారతదేశ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా ప్రధాని, క్రౌన్స్‌ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రధాని నరేద్ర మోడీతో సమావేశమయ్యారు. న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.ఇద్దరి మధ్య విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వాణిజ్యం, రక్షణ, పెట్టుబడుల గురించి ప్రధాని మోదీ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చించారు.

రెండు దేశాల మధ్య పరస్పర సహకారంపై పలు ఒప్పందాలపై ఇద్దరు నేతలు సంతకాలు చేశారు. భారతదేశానికి, సౌదీ అరేబియా అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి అని ప్రధాని మోడీ అన్నారు. తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలను గుర్తించామని, ఇది మా మధ్య సంబంధాలకు కొత్త శక్తిని, దిశానిర్దేశం చేస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories