Sanjay Jha Suspended From Congress: మరో సీనియర్‌ నేతను సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్‌

Sanjay Jha Suspended From Congress: మరో సీనియర్‌ నేతను సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్‌
x
Former spokesperson Sanjay Jha suspended from Congress for anti-party activities
Highlights

Sanjay Jha Suspended From Congress: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా రాజస్థాన్ లో డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అలాగే ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులను కాంగ్రెస్ పార్టీ తొలగించింది.

Sanjay Jha Suspended From Congress: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా రాజస్థాన్ లో డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అలాగే ఆయన వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులను కాంగ్రెస్ పార్టీ తొలగించింది. దీంతో సచిన్ పైలట్ కాంగ్రెస్ వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు సచిన్ పైలట్ కు సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ లో అసమ్మతి గళం వినిపించే వారిపై కూడా ఆ పార్టీ చర్యలు తీసుకుంటోంది. ఇక తాజాగా మరో నేతపై చర్యలకు ఉపక్రమించింది కాంగ్రెస్.. ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్‌ ఝాను సస్పెండ్‌ చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ‌ ప్రకటించింది. ఈ

మేరకు పార్టీ రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ బాలాసాహెబ్‌ తోరత్‌ సంజయ్‌కు మంగళవారం నోటీసులు జారీ చేశారు. కాగా కాంగ్రెస్‌ నేత సంజయ్‌ ఝా.. పలుమార్లు పార్టీని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఆయనను పార్టీ అధికార ప్రతినిధి పదవీ నుంచి ఇటీవల అధిష్ఠానం తొలగించింది. మంగళవారం సచిన్‌ పైలట్‌ను సమర్ధిస్తూ ఒక ఛానల్ లో మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారాయన. 2013 నుంచి 2018 వరకు పార్టీ కోసం సచిన్‌ పైలట్‌ తన రక్తం ధారపోసి, చెమట చిందింఛారని, 21 సీట్లు ఉన్న కాంగ్రెస్‌ను 100 సీట్లకు పెంచిన కృషికి ఇలా చేయడం తగదని విమర్శించాడు. దాంతో సీరియస్ అయిన కాంగ్రెస్.. ఆయనను సస్పెండ్ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories