TOP 6 News @ 6PM: పోలీసుల నోటీసులకు రిప్లై ఇచ్చిన సంధ్య థియేటర్ యాజమాన్యం
1) పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం రిప్లై సంధ్య థియేటర్ ఘటన తరువాత పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం స్పందించింది....
1) పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం రిప్లై
సంధ్య థియేటర్ ఘటన తరువాత పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం స్పందించింది. పోలీసులకు వివరణ ఇస్తూ 6 పేజీల లేఖను అడ్వకేట్స్ ద్వారా పోలీసులకు పంపించింది. సంధ్య థియేటర్ కు అన్నిరకాల అనుమతులు ఉన్నాయని థియేటర్ యాజమాన్యం తమ వివరణలో పేర్కొంది.
గత 45 ఏళ్లుగా సినిమాలు ప్రదర్శిస్తున్నామని, ఎన్నో సినిమాలకు స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ వచ్చి వెళ్లారు కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని యాజమాన్యం చెప్పుకొచ్చింది. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4, 5 తేదీల్లో సంధ్య థియేటర్‌ను ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంగేజ్ చేసుకుందని చెప్పారు.
2) భార్య పేరు చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటు - పేర్ని నానితో మంత్రి కొల్లు రవీంద్ర
పేర్ని నానికి, ఆయన బినామీలకు మంత్రి కొల్లు రవీంద్ర నేరుగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేర్ని నానికి, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం తినేసి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని అన్నారు. భార్య పేరుతో గోడౌన్ ఉంటే అక్కడేం జరుగుతుందో చూసుకోవాల్సిన జాగ్రత్త లేదా అని ప్రశ్నించారు. ఇదంతా కేవలం ఆమె పేరు వాడుకుని బయటపడాలనుకోవడమే అవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు.
పేర్ని నానిని ఉద్దేశించి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... దొంగతనం చేసి ఆ సొమ్ము తిరిగిచ్చేస్తే దొర అయిపోరు.. దొంగ దొంగే అవుతారని అన్నారు. పేర్ని నాని పోర్టు చుట్టుపక్కల గ్రామాల్లోని భూములు లాక్కోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. అందుకే పేర్ని నాని ఇక చట్టం నుండి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
3) మీ ఏడాది పాలన వైఫల్యానికి ఇదే నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ట్వీట్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే, బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుందని హరీష్ రావు అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ కేజీబీవీ పాఠశాలలో “ఈ బువ్వ మేము తినలేము, మమ్మల్ని తీసుకెళ్లండి” అని విద్యార్థులు తల్లిదండ్రులను వేడుకుంటున్నారని అన్నారు. అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి నెలకొందని తెలిపారు. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారని.. ఇప్పుడేమో అదే గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిన మార్పు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ మేము ఉండలేము అని విద్యార్థులు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కన్నబిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకపోతున్నారు. ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఇంకా ఏముంటుంది అని సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ ద్వారా నిలదీస్తూ హరీష్ రావు ఈ పోస్టు పెట్టారు.
4) TGSRTC: సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా? అయితే మీ తెలంగాణ ఆర్టీసీ నుంచి గుడ్ న్యూస్
TGSRTC: ఈ సంవత్సరం సంక్రాంతికి హైదరాబాద్ నుంచి 2400 ప్రత్యేక బస్సులు నెడుతున్నట్లు ఏపీఆర్టీసీ తెలిపిన వెంటనే తెలంగాణ ఆర్టీసీ కూడా దీనిపై స్పందించింది. తాము ఏకంగా 5వేల ప్రత్యేక బస్సులను నడపబోతున్నట్లు తెలిపింది. సంక్రాంతి పండగను ఎక్కువగా జరుపుకునేది ఏపీలోనే. ఏపీకంటే తెలంగాణ ఆర్టీసీ ఎక్కువగా బస్సులు వేస్తూ ఫెస్టివల్ రష్ ను బాగా క్యాష్ చేసుకుంటోంది.
సాధారణంగా పండగకు ఊరువెళ్లేటప్పుడు ప్రైవేట్ ట్రావెలర్స్ భారీగా ఛార్జీలు పెంచుతుంటారు. తెలంగాణ ఆర్టీసీ మాత్రం అదనపు ఛార్జీలు ఏవి ఉండవని స్పష్టం చేసింది. అయితే 5వేల బస్సులను ఎప్పుడూ కూడా నడపలేదు. ఈసారి భారీ సంఖ్యలో బస్సులను నడుపుతోంది. ఏపీఎస్ ఆర్టీసీ వైపు ప్రయాణికులు చూడకూడదని అనుకున్నారేమో తెలంగాణ ఆర్టీసీ అధికారులు. అందుకే ఈసారి ఎక్కువగా బస్సులను కేటాయించారు.
5) Jasprit Bumrah Record: జస్‌ప్రీత్ బుమ్రా మామూలోడు కాడు.. చెలరేగిపోతున్న ఫాస్ట్ బౌలర్
Jasprit Bumrah రికార్డ్స్ in Ind vs Aus : జస్సీ లాంటి వారు ఎవరూ లేరు... టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కోసం ఈ డైలాగ్ ఎందుకు ఉపయోగించారో గానీ సరిగ్గా కొన్ని రోజులుగా అదే జరుగుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్‌బోర్న్ టెస్టు తొలి రెండు రోజుల్లో ఆతిథ్య జట్టుపై భారం పడింది. అయితే మూడో రోజు ఆటలో బ్యాట్స్‌మెన్ పునరాగమనం చేయగా, నాలుగో రోజు జస్‌ప్రీత్ బుమ్రా కథ మొత్తం మార్చేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టు రాణించింది. ఒక్క స్పెల్‌తో ఎన్నో పెద్ద రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు జస్‌ప్రీత్ బుమ్రా.
మెల్‌బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తను ట్రావిస్ హెడ్ వికెట్‌ను తీయడం ద్వారా తన టెస్ట్ కెరీర్‌లో 200 వికెట్లను తీసుకున్న రికార్డ్ సొంతం చేసుకున్నాడు. కేవలం 44 మ్యాచ్‌ల్లో ఈ బుమ్రా ఈ రికార్డ్ సాధించాడు. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. బుమ్రా 19.38 సగటుతో ఈ 200 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంత తక్కువ సగటుతో 200 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ బుమ్రానే. ఇప్పటి వరకు 200 వికెట్లు తీసిన వారందరి సగటు 20 కంటే ఎక్కువే. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) South Korea plane crash: ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం..విమాన ప్రమాదంలో 179 మంది దుర్మరణం
South Korea plane crash: దక్షిణకొరియాలోని ముయూన్ ఇంటర్నెషనల్ ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణంగా ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలు దేరిన ది బేజు ఎయిర్ ఫ్లైయిట్ చెందిన 7సి2216 నెంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపుతప్పింది. ఫెన్సింగ్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సిబ్బంది తప్పా మిగతావాళ్లంతా మరణించినట్లు సమాచారం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire