సీఎం సమోసా మిస్సింగ్.. సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన సర్కారు.. అసలు స్టోరీ ఏంటంటే..?

Samosas for Himachal CM Served to Security Staff
x

సీఎం సమోసా మిస్సింగ్.. సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన సర్కారు.. అసలు స్టోరీ ఏంటంటే..?

Highlights

Samosa: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సమోసాల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Samosa: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సమోసాల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కోసం ఆర్డర్ పెట్టిన సమోసాలు, స్నాక్స్ మిస్ అయ్యాయి. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం ఏకంగా సీఐడీ అధికారులతో ఎంక్సైరీ చేయించినట్టు వార్తలు వైరల్ కావడంతో ఈ విషయంపై సీఎం క్లారిటీ ఇచ్చారు.

సాధారణంగా రాజకీయ నేతలు, ముఖ్య నాయకులు వచ్చినప్పుడు.. కొన్ని ప్రదేశాల్లో మీటింగ్‌లలో స్పెషల్ స్నాక్స్ ఏర్పాటు చేస్తుంటారు. స్థానికంగా ఉండే స్పెషల్ ఫుడ్ లను సైతం ఆర్డర్ చేస్తారు. అయితే ఫుడ్ విషయంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది.

హిమాచల్ ప్రదేశ్ సీఎం ఇటీవల సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ ను ప్రారంభించడానికి వెళ్లారు. అక్కడ అధికారులు ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ప్రత్యేకంగా సమోసాలు, స్నాక్స్ ను సీఎం సుఖ్విందర్ సింగ్ కోసం తెప్పించి ఆయన కోసం ఏర్పాటు చేసిన టేబుల్ పై ఉంచారు. కానీ సీఎం అక్కడకు వెళ్లి కూర్చునే సరికి సమోసా, కేకులు, స్నాక్స్ అక్కడ లేవు. సీఎం అక్కడ చాలా సేపు కూర్చొని చివరకు వెళ్లిపోయారు. ఆపై సీఎంకు కనీస మర్యాదలు పాటించార అంటూ మండిపడినట్టు సమాచారం.

సీఎంకు సమోసాలు ఎందుకు అందలేదన్న విషయంలో సీఐడీ బాస్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఓ సీనియర్ అధికారి ఎంక్సైరీ చేపట్టడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 21న సీఎం సుఖేందర్ సింగ్ సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించడానికి వెళ్లారు. సీఎం కోసం సమోసాలు కేకులు తెప్పించాలని ఓ ఐజీ ర్యాంక్ అధికారి ఎస్సైకి చెప్పారు. ఆయన ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సిమ్లాలోని లక్కర్ బజార్ లో ఉన్న రాసిసన్ బ్లూ హోటల్ కు వెళ్లారు. మూడు బాక్సుల్లో సమోసాలు, కేకులు తీసుకొచ్చారు. ఆ బాక్సులను MT విభాగానికి పంపించారు. అక్కడ నుంచి సీఎం దగ్గరకు సమోసాలు వెళ్లాల్సి ఉంది.

కానీ సమోసాలు ఎవరికి ఇవ్వాలనేదానిపై MT విభాగంలో ఎవరికి క్లారిటీ లేదు. వివరంగా చెప్పాల్సిన ఎస్సై చెప్పలేదు. దీంతో ఆ సమోసాలు అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి వడ్డించేశారు. మీటింగ్ లో ఉన్న సీఎంతో పాటు.. సీఐడీ బాస్, ఇతర ఉన్నతాధికారులు ఆకలితోనే వెనుదిరిగారు. దీంతో సీఎంకు మర్యాదలు చేయలేకపోయామన్న అవమానం సీఐడీ బాస్ ను వెంటాడింది. ఎంక్వైరీ వేయడంతో సమన్వయ లోపమే దీనికి కారణమని తేలింది.

ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎంకు సమోసాలు అందలేదని విచారణకు ఆదేశించారంటూ విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించమని అధికారం ఇస్తే.. సమోసాల గోల ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దేశంలో మరే సంఘటన దొరకలేదా సీఐడీ దర్యాప్తుకు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు. కేవలం ఇదంతా మీడియా సృష్టి మాత్రమేనని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories