Sachin Pilot about Joining in BJP: నేను బీజేపీలో చేరట్లేదు.. సచిన్‌ పైలట్‌ స్పష్టం!

Sachin Pilot about Joining in BJP: నేను బీజేపీలో చేరట్లేదు.. సచిన్‌ పైలట్‌ స్పష్టం!
x
sachin Pilot (file photo)
Highlights

Sachin Pilot about Joining in BJP: రాజస్థాన్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి స‌చిన్ పైల‌ట్ పై కాంగ్రెస్ పార్టీ అన‌ర్హ‌త నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే..

Sachin Pilot about Joining in BJP: రాజస్థాన్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి స‌చిన్ పైల‌ట్ పై కాంగ్రెస్ పార్టీ అన‌ర్హ‌త నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. డిప్యూటీ సీఎం గానే కాకుండా పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా ఆయనను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా ఢిల్లీలో మంగళవారం మీడియాకి వెల్లడించారు.సచిన్ పైలట్ తో పాటుగా ఆయన వెంట ఉన్న విశ్వేందర్ సింగ్, రమేష్ మీనాలను మంత్రి పదవుల నుంచి నుంచి తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు.

సచిన్ పైలట్ కి కాంగ్రెస్ పార్టీ ఉద్వాసన పలకడంతో ఆయన బీజేపీలో చేరతారా లేకా కొత్త పార్టీ ఏమైనా పెడతారా అన్న దానిపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ దీనిపైన స్పందించారు.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీపై పోరాడి గెలిచామ‌ని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి తాను ఎంతో కృషి చేశానని, ఇప్పుడు తానెందుకు బీజేపీలో చేరాల‌ని పైల‌ట్ ప్ర‌శ్నించారు. తాను బీజేపీలో చేరట్లేదని , కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, అలా వస్తున్న వార్తలు కూడా అవాస్తవమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.. అయితే భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సచిన్‌ పైలట్ వెల్లడించారు... అయితే, సచిన్‌ తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

జైపూర్‌లో జరిగిన సీఎల్పీ భేటీకి వరుసగా రెండో రోజూ సచిన్ పైలట్ గైర్హాజరయ్యారు. దీనితో ఆ భేటీలో పాల్గొన్న 102 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ ను పార్టీ నుంచి తొలిగించాలని డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీనితో ఆ పార్టీ ఆయన పై వేటు వేసింది. ఇక సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ దోత్సారాను రాజస్థాన్ పీసీసీ చీఫ్‌గా నియమించినట్లు రణదీప్ సుర్జేవాలా తెలిపారు.

ఈ సందర్భంగా రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. సచి న్ పైలట్ తో పాటుగా ఎనమిది మంది బీజేపీ కుట్రలో చిక్కుకోని ఎనమిది కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారని, అందుకే వారిని మంత్రివర్గం నుంచి తప్పించినట్లుగా వెల్లడించారు..

Show Full Article
Print Article
Next Story
More Stories