శబరిగిరి మహోత్సవం.. తిరువాభరణాలు ఎవరు? ఎప్పుడు చేయించారు?

శబరిగిరి మహోత్సవం.. తిరువాభరణాలు ఎవరు? ఎప్పుడు చేయించారు?
x
Highlights

సం‌క్రాంతి అనగానే అయ్యప్పస్వామి భక్తులు భక్తిపర్వశ్యంతో పులకించిపోతారు.

సం‌క్రాంతి అనగానే అయ్యప్పస్వామి భక్తులు భక్తిపర్వశ్యంతో పులకించిపోతారు. శబరిమలలో పొన్నంబల మేడుపై జ్యోతి రూపంలో దర్శనిమిచ్చే మణికంఠుడిని చూసి తన్మయత్వానికి లోనవుతారు. సంక్రాంతి రోజు తిరువాభరణాల విడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పందళం మణికంఠ స్వామి స్వయంగా తిరుగాడిన ప్రాంతమే ఇదీ. అచ్చెన్‌ కోవిల్‌ నది ఈ ప్రదేశంలో ప్రవహిస్తుంటుంది. ఈ నదీ తీరంలో అయ్యప్ప మణికంఠుని పేరుతో 12 ఏళ్ల పాటు నివసించిన పందళ రాజ మందిరాన్ని నేటికీ సందర్శించవచ్చు.

అంతేకాదు మణికంఠుడు పట్టాభిషేకం కోసం చేయించిన ఆభరణాలను మకర సంక్రాంతి రోజు ధరిస్తానని తల్లిదండ్రులకు మాట ఇచ్చినట్లు చెబుతారు. అనంతరం తపస్సు చేయాలని నిర్ణయించకున్నాక అయ్యప్ప. శబరిమల దివ్య మందిరంలో మకర సంక్రాంతి సందర్భంగా రాజలాంఛనాలతో పందళ రాజ వంశీయుల ఆధ్వర్యంలో పూజలు జరిగేట్లు అనుగ్రహించాడు. అప్పటి నుంచి సంక్రాంతి సందర్భంగా ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతోంది.

పందళం రాచమందిరంలో తిరువాభరణాలను ఏడాది పొడవునా ఉంచుతారు. పందళ రాజ వంశీయులు నిత్యం వీటికి పూజలు నిర్వహిస్తారు. పందళ రాజ వంశంలో వళియ రాజు పెద్దవాడిగా పిలువబడతాడు. తిరువాభరణాల వేడుక సంక్రాంతికి 4 రోజుల ఆరంభం అవుతాయి. అయ్యప్ప భక్తులు చుట్టుపక్కల నుంచి ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. తిరువాభరణం పెట్టెలకు పూజలు చేసి వలియ కోయిక్కర్‌ ధర్మశాస్త్ర ఆలయానికి తీసుకెళ్తారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు.

తిరువాభరణాలకు పరుశురాముడు గరుడ బంధనం వేసినట్లు పురాణాల్లో చెబుతారు. ఈ వేడుక సాగినంత వరకు గరుడ పక్షి ఆకాశంలో సంచరిస్తుందని చెబుతారు. తిరువాభరణాల యాత్ర జరిగినంత మేర గ్రామాల్లో భక్తులు ఇంటి ముందు జ్యోతి వెలిగించి స్వాగతం పలుకుతారు. అయిరూర్‌, పెరియాడ్‌, పుంగావనం, నీలక్కల్‌ మీదుగా దట్టమైన అటవీ ప్రాంతానికి చేరగానే గిరిజన ప్రజలు జేజేలు పలుకుతారు. తిరువాభరణం ఊరేగింపు స్వామివారి సన్నిధికి చేరుకుంటుంది. అక్కడి నుంచి 18 మేట్లగుండా స్వామివారి గర్భాలయాలనికి చేరుస్తారు. ఆభరణాలకు స్వామివారికి అలంకరిస్తారు. ఆ తర్వాత కాంతిమల మీద మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామీ భక్తులకు దర్శనమిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories