Sabarimala: శబరిమల అయ్యప్ప దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి

Sabarimala pilgrims are permitted to visit Sabarimala this year only through online booking, complete details
x

Sabarimala: శబరిమల అయ్యప్ప దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి

Highlights

Sabarimala : కేరళ సర్కార్ కీలక ప్రకటన చేసింది. 2024 శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్ లైన్ బుకింగ్ ద్వారానే యాత్రికులను అనుమతి ఇవ్వున్నట్లు వెల్లడించింది. మరో నెల రోజుల్లో మకరవిళ్లక్కు సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రోజుకు గరిష్టంగా 80వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Sabarimala : వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. తీర్థయాత్రల సన్నాహాలను సమీక్షించాలని సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన ఓ ప్రకటనలో తెలిపింది. మకరవిళ్లక్కు సీజన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని..రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జాగ్రత్తగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పార్కింగ్ సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్లు, దాని చుట్టూ పార్కింగ్ నిర్వహణ పనులు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తయ్యిందని మరొకటి త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలిపారు.

కాగా గత ఏడాది డిసెంబరులో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని నియంత్రించడంలో దేవస్థానం బోర్డు ఘోరంగా విఫలమైంది. భక్తులకు కనీస వసతులు కల్పించలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చింది. కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. అప్పట్లో దేవాస్తానం బోర్డుపై ఘోరంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మండల పూజలు, మకరవిళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్స్ ను దేవస్థానం బోర్డు రద్దు చేసింది.

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి మండల పూజలు, మకరజ్యోతి సమయంలో లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఆ సమయంలో ప్రతిరోజూ 1,20, 000 మందికిపైగా భక్తులు శబరిమలకు చేరుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత మండల సీజన్ లో భక్తుల తాడికి భారీగా పెరిగింది. దర్శన సమాయాన్ని గంట పెంచిన కూడా రద్దీని కంట్రోల్ చేయలేకపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories